iDreamPost
android-app
ios-app

జూలై 24న ఆకాశంలో అద్భుత దృశ్యం! 18 ఏళ్ల తరువాత! అస్సలు మిస్ కావద్దు!

Saturn lunar Eclipse: తరచూ విశ్వంలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొన్ని కొన్ని అద్భుతాలు వందల సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంటాయి. అలానే జూలై 24వ తేదీన కూడా ఓ అరుదైన దృశ్యం కనిపించనుంది.

Saturn lunar Eclipse: తరచూ విశ్వంలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొన్ని కొన్ని అద్భుతాలు వందల సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంటాయి. అలానే జూలై 24వ తేదీన కూడా ఓ అరుదైన దృశ్యం కనిపించనుంది.

జూలై 24న ఆకాశంలో అద్భుత దృశ్యం! 18 ఏళ్ల తరువాత! అస్సలు మిస్ కావద్దు!

ఈ విశ్వం అనేది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. ఇందులో సౌర కుటుంబం కూడా ఒక  చిన్న భాగం. దీని చుట్టూ భూమితో పాటు ఇతర గ్రహాలు కూడా తిరుగుతుంటాయి. ఇలా వీటి భ్రమణ క్రమంలో, ఇతర సందర్భల్లో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొన్ని కొన్ని అద్భుతాలు కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంటాయి. అలానే మరికొన్ని ఏళ్ల సంవత్సరాలకు ఒక్కరిసారి ఏర్పడుతుంటాయి. తాజాగా శని గ్రహం కారణంగా దాదాపు 18 ఏళ్ల తరువాత ఆకాసంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. అది కూడా మన ఇండియాలోనే కనిపించనుంది. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మనం సాధారణంగా సూర్య గ్రహణం, చంద్రగ్రహణం గురించి ఎక్కువగా వింటాము. ఇది భూమి, చంద్రుల భ్రమణాల కారణంగా ఏర్పడుతుంటాయి. అలానే సౌరకుటుంబంలోని వివిధ గ్రహాలు తమ పరిభ్రమణ  సమయంలో ఇతర గ్రహాల సమీపంలోకి చేరడంతో అరుదైన దృశ్యాలు కనువిందు చేస్తాయి కొన్ని నేరుగా కళ్లతో చూడవచ్చు. మరికొన్ని దృశ్యాలను టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా సూర్య, చంద్ర గ్రహణం లాంటిదే. కానీ వీటికి మాత్రం కాదు. అదే తరహాలో శనిగ్రహం ఓ అద్భుత దృశ్యం ఏర్పడేందుకు కారణం అవుతోంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యం 18 ఏళ్ల తర్వాత ఇండియాలో కనిపించనుంది.

ఈ అరుదైన ఘటన భారతదేశంలో జూలై 24వ తేదీ నుంచి జూలై 25వ తేదీ అర్ధరాత్రి కనిపిస్తుంది. ఈ సమయంలో శని గ్రహం చంద్రుని వెనుకు వెళ్తుంది. తన పరిభ్రమణ క్రమంలో శని గ్రహం అలా చంద్రుని చాటుకు వెళ్తోంది. దీంతో శని గ్రహానికి ఉండే వలయాలు చంద్రుని వైపు నుండి మనకు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దీనిని అధ్యయనం చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనినే శని చంద్రగ్రహణం అని పిలుస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండా ఈ  దృశ్యాన్ని మనం కళ్లతో నేరుగా వీక్షించవచ్చు.

ఈనెల 24 బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఆకాశంలో ఈ అద్భుతం కనివిందు చేయనుందని పరిశోధకులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1.44 గంటలకు శని గ్రహం పూర్తిగా చంద్రుడి వెనక్కి వెళ్తుంది. జూలై 25 తేది  తెల్లవారుజామున  2.25 గంటలకు శని గ్రహం చంద్రుని వెనుక నుండి బయటకు రావడం కనిపిస్తుంది. కొన్ని గంటల పాటు ఈ ఖగోళ దృశ్యం ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేస్తుంది. ఈ అద్భుతమైన  దృశ్యం ఇండియాలో కూడా కనిపించనుంది. భారత్ తో పాటు శ్రీలంక, మయన్మార్, చైనా, జపాన్‌లలో కూడా ఈ దృశ్యాన్ని వేర్వేరు సమయాల్లో కనువిందు చేయనుంది. ఈ రెండు వేగంగా కదులుతున్నప్పుడు తమ మార్గాన్ని మార్చుకున్నప్పుడు శని గ్రహం పైకి లేచినట్లు కనిపిస్తుంది. శని వలయాలు ముందుగా కనిపిస్తాయని  పరిశోధకులు అంటున్నారు.  శని గ్రహ వలయాలను చూడాలంటే చిన్న టెలిస్కోప్ ఉపయోగించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి