iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చిరుతతో జర్నలిస్టు ఫైట్..

సాధారణంగా పిల్లి ఎదురైతేనే అపశకునం భావించి.. కాసేపు మన ప్రయాణాన్ని వాయిదా వేస్తాం. అలాంటిది అతడికి ఒక పులి ఎదురైంది. ఎదురుకావడమే కాదు అతని కాలును తన నోటితో కరిచి పట్టుకుంది. ఆ తరువాత ఏం జరిగిందంటే..

సాధారణంగా పిల్లి ఎదురైతేనే అపశకునం భావించి.. కాసేపు మన ప్రయాణాన్ని వాయిదా వేస్తాం. అలాంటిది అతడికి ఒక పులి ఎదురైంది. ఎదురుకావడమే కాదు అతని కాలును తన నోటితో కరిచి పట్టుకుంది. ఆ తరువాత ఏం జరిగిందంటే..

వీడియో: ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చిరుతతో జర్నలిస్టు ఫైట్..

సాధారణంగా ఎవరైనా ఏదైన వన్యమృగాలు ఎదురైతే భయంతో పరుగులు తీస్తారు. ముఖ్యంగా పులి, సింహం వంటి క్రూర మృగాలు ఎదురైతే ఇక పై ప్రాణాలు పైనే పోతాయి. చాలా తక్కువ  మంది మాత్రమే వాటిపై ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తారు. అలానే ఓ వ్యక్తి కూడా తనకు ఎదురు పడిన ఓ చిరుతను నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిరుత తన నోటితో ఆ వ్యక్తి కాలును పట్టుకుంది. చివరకు దానితో పోరాడి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్ పూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం అటవి ప్రాంతానికి సమీపంలో ఉంది.  ఇదే గ్రామానికి సమీపంలో భదర్ మోట్వాల్ అనేలో చిరుత పులి సంచరించింది. అక్కడే ఓ జంతువును వేటాడి ఆ చిరుత చంపి తినేసింది. దీంతో స్థానికులు భయాందోళకు గురై.. అక్కడి నుంచి పరుగులు తీసి.. దుంగార్ పూర్ గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న ఓ జర్నలిస్టుకు చిరుత విషయం చెప్పారు. దీంతో సదరు విలేఖరి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అక్కడ చిరుత పులి చంపిన జంతువును ఫోటోలు తీసుకున్నాడు. అంతేకాక అక్కడే ఇళ్లల్లో ఉన్న వారిని కలుసుకునే.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం తిరిగి దుంగార్ పూర్ కి ప్రయాణం అయ్యాడు. ఇదే సమయంలో అకస్మాత్తుగా చిరుతపులి వచ్చి..సదరు జర్నలిస్ట్ పై దాడి చేసింది.

అతడు ప్రతిఘట్టించినప్పటికీ చిరుత విడవలేదు. ఆ వ్యక్తి కాలిని నోటితో గట్టిగా అదిమి పట్టుకుంది. తన పంజా దెబ్బతో అతడిని చంపాలనుకుంది. అయితే ఆ జర్నలిస్టు కూడా  ఇక  ప్రాణాలు ఎలాగు పోతాయని డిసైడ్ అయ్యాడు. దీంతో వెంటనే చిరుతపులిపై తీవ్రంగా ప్రతిఘటించాడు. ఆ పులికి  ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ఫైట్ చేశాడు. చిరుత తన కాలిని నోట కరుచుకున్నా.. జర్నిలిస్టు భయపడలేదు. పైగా కేకలు వేస్తూ చిరుతపులిని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన కేకలు విన్న గ్రామస్తులు వచ్చి తాళ్లతో ఆ పులిని బంధించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో..వారు వచ్చి ప్రత్యేక వాహనంలో చిరుతపులిని జూ కి తీసుకెళ్లారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విలేఖరి సాహసానికి మెచ్చుకోవాల్సిందేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు  కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.