Arjun Suravaram
Devesh Chandra Thakur: ఇటీవలే లోక్ సభ ఎన్నికలు జరగడం, ఫలితాలు రావడం అంతా జరిగిపోయింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Devesh Chandra Thakur: ఇటీవలే లోక్ సభ ఎన్నికలు జరగడం, ఫలితాలు రావడం అంతా జరిగిపోయింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం ఎన్నోకబడి, ప్రజల కోసం సేవ చేసేవాడు. జనాల కష్టాలను తెలుసుకుని పరిష్కారం చూపించడం ప్రజాప్రతినిధి కర్తవ్యం. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గంలో ఉండే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతుండాలి. చాలా మంది అలానే తమ విధులు నిర్వహిస్తున్నారు. కానీ కొందరు మాత్రం తమకు ఓటువేసిన వారి గురించే పట్టించుకుని మిగిలిన ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తాజాగా ఓ పార్లమెంట్ సభ్యుడు అవే వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వెయ్యనివారి కోసం పని చెయ్యనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి.. ఆయన ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవలే లోక్ సభ ఎన్నికలు జరగడం, ఫలితాలు రావడం అంతా జరిగిపోయింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. అలానే పలు రాష్ట్రాల్లోని ప్రజలు విభిన్నమైన తీర్పు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే.. బిహార్ రాష్ట్రానికి చెందిన జేడీయూ పార్టీకి చెందిన ఎంపీ దేవేశ్ చంద్ర ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయని వాళ్లకోసం పని చేయబోనంటూ కీలక కామెంట్స్ చేశారు. ఆయన బిహార్ రాష్ట్రంలోని సీతామర్హి లోక్ సభ నియోజవర్గం నుంచి ఎంపీగా గెలిచిచారు. అనంతరం ఇటీవల నిర్వహించిన ఓ సమా వేశంలో ఠాకూర్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ముస్లిం, యాదవులపై తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. లోక్సభ ఎన్ని కల్లో తనకు ఓటు వేయనందున ఆ రెండు వర్గాల ప్రజలు ఎలాంటి వినతిపత్రాలు ఇచ్చినా తీసుకోననంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఆయన మాట్లాడుతూ.. తన వద్దకు రావాలనుకునే ముస్లిం, యాదవులు వచ్చి స్నాక్స్ తీసుకోవచ్చని, అలానే టీ కూడా తాగొచ్చని తెలిపారు. అయితే ఎలాంటి సాయం అడగవద్దని ఆయన తెలిపారు. ఈమధ్య మైనార్టీ సామాజివర్గాని చెందిన ఒకతను ఏదో పనిమీద తన దగ్గరికి వచ్చిండని, ఆర్జేడీకి ఓటేశారా అని తాను అడిగిని తెలిపారు. అయితే ఆ వ్యక్తి నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంతే, టీ తాగి వెళ్లిపొమ్మని చెప్పినని ఠాకూర్ వివరించారు. బీజేపీతో పొత్తు కారణంగా యాదవులు, ముస్లిం వర్గాలు తనకు ఓటేయలేదని అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
#WATCH | On JD(U) MP Devesh Chandra Thakur’s “Muslims, Yadavs didn’t vote for me, won’t help them” remark, party leader Neeraj Kumar says, “Devesh Chandra Thakur is a newly-elected MP from Sitamarhi. The pain he expressed among his workers was on the basis of his work experience.… pic.twitter.com/jzFYa8rhb1
— ANI (@ANI) June 18, 2024