iDreamPost
android-app
ios-app

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పాఠశాలల్లో గుడ్ మార్నింగ్ కాదు..!

Haryana school: ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్వసం జరుపుకునేందుకు దేశ ప్రజలందరూ సిద్ధమయ్యారు.  ఈసారి పండగను ఘనంగా జరుపుకునేందుకు అన్నీ రాష్ట్రాలు సర్వం సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Haryana school: ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్వసం జరుపుకునేందుకు దేశ ప్రజలందరూ సిద్ధమయ్యారు.  ఈసారి పండగను ఘనంగా జరుపుకునేందుకు అన్నీ రాష్ట్రాలు సర్వం సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పాఠశాలల్లో గుడ్ మార్నింగ్ కాదు..!

ప్రతి రోజూ  ఉదయాన్నే అందరం గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా పాఠశాలల్లో అయితే ఈ పదం తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. అయితే ఇది ఇంగ్లీష్ పదమని, కొందరు తెలుగులో శుభోదయం అని చెబుతుంటారు. ఇది ఇలా ఉంటే.. ఈ గుడ్ మార్నిగం విషయంలో ఓ రాష్ట్రం కీలక ఆదేశాలను జారీ చేసింది. గుడ్ మార్నింగ్ కి బదులు, జైహింద్ అని పలకాలనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆగష్టు 15 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మరి..ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్వసం జరుపుకునేందుకు దేశ ప్రజలందరూ సిద్ధమయ్యారు.  ఈసారి పండగను ఘనంగా జరుపుకునేందుకు అన్నీ రాష్ట్రాలు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలల్లో కొత్త రూల్స్ ను తీసుకువచ్చింది. స్కూల్స్ లో గుడ్ మార్నింగ్‌కు బదులు జై హింద్ అని వాడాలని హర్యానా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగాఈ నిర్ణయం తీసుకున్నారు. హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ నాయబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, దేశ ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ఇక తాజా ఉత్తర్వుల ప్రకారం…హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులకు, తోటి స్నేహితులకు గుడ్‌ మార్నింగ్‌కు బదులుగా జై హింద్‌ అని సంబోధించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగష్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగురవేసే ముందు నుంచి ఈ కొత్త రూల్ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. గతంలోనూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలకు సంబంధించి పలు కీలక నిబంధనలు తీసుకొచ్చాయి.  మరి.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.