Jagat Seth Indias Richest Banker: బ్రిటీష్ వాళ్లకే అప్పులు ఇచ్చిన భారతీయుడు.. ఆయన సంపద ఎంతంటే

బ్రిటీష్ వాళ్లకే అప్పులు ఇచ్చిన భారతీయుడు.. ఆయన సంపద ఎంతంటే

Jagat Seth: భారతదేశపు బిలియనీర్లు అనగానే అంబానీ, అదానీ గుర్తుకు వస్తారు. కానీ వీరిని మించిన ఐశ్వర్యవంతుడు ఒకరు ఉన్నారు. ఆయన సంపద విలువ నేటి కాలంలో ఒక ట్రిలియన్ అంటే ఎంత గొప్ప ధనవంతుడో అర్థం చేసుకోవచ్చు. ఆయన వివరాలు మీ కోసం

Jagat Seth: భారతదేశపు బిలియనీర్లు అనగానే అంబానీ, అదానీ గుర్తుకు వస్తారు. కానీ వీరిని మించిన ఐశ్వర్యవంతుడు ఒకరు ఉన్నారు. ఆయన సంపద విలువ నేటి కాలంలో ఒక ట్రిలియన్ అంటే ఎంత గొప్ప ధనవంతుడో అర్థం చేసుకోవచ్చు. ఆయన వివరాలు మీ కోసం

భారతదేశంలో ధనవంతులు, కోటిశ్వరులు, బిలియనీర్లు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అంబానీ, అదానీ పేర్లే. వాళ్లంటే ఈ తరం బిలియనీర్లు. కానీ చరిత్రలో కాస్త వెనక్కి వెళ్లి.. భారతీయ ధనవంతులు ఎవరంటే.. రాజులు, చక్రవర్తుల పేర్లు చెబుతాం. చివరి నిజాం ప్రభువు.. ఆయన కాలంలో ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నట్లు వార్తలు చదివాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి వీరిని మించిన వారు. బ్రిటీష్ వాళ్లు దేశాన్ని పాలిస్తున్న కాలంలో అంబానీ కంటే గొప్ప ధనవంతుడు, బ్రిటిష్ వారికి సైతం అప్పులిచ్చిన భారతీయుడి గురించి మీకు తెలుసా.. లేదా.. ఇప్పుడు ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఆ వివరాలు..

బ్రిటీష్ వారి కాలంలో ఏకంగా వారికే అప్పులు ఇచ్చిన వ్యక్తి సేథ్ ఫతే చంద్ అలియాస్ ‘జగత్ సేథ్‘. అతను 18వ శతాబ్దపు అతిపెద్ద అంతర్జాతీయ బ్యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన స్వస్థలం పశ్చిమ బెంగాల్‌. ఆయన ఎంతటి ఐశ్వర్యవంతుడు అంటే.. ఆ కాలంలో బ్రిటిష్ వారు సైతం ఆయన దగ్గర అప్పులు తీసుకునే వారు. దాంతో మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా 1723లో ఫతే చంద్‌కు జగత్ సేథ్ అనే బిరుదును ప్రదానం చేశాడు. దీని అర్థం ‘ప్రపంచ బ్యాంకర్’ అని. ఆయన ఆ పేరును సార్థకం చేసుకున్నాడు. ఆ సమయంలో అతని నికర ఆస్తుల విలువ నేటి బిలయనీర్లు అంబానీ, అదానీల భారీ సంపదకు సమానం.

నికర సంపద ఇక ట్రిలియన్..

బ్రిటిష్ పాలనలో, భారతదేశం ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆ కాలంలో జగత్ సేథ్ గొప్ప వ్యాపారవేత్తగా, బ్యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ఆయన బ్రిటీష్ వాళ్లకు సైతం వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. అప్పట్లో ఆయన సంపద నికర విలువ.. నేటి కరెన్సీలో ఒక ట్రిలియన్ అంటే 8,31,24,15,00,00,000 కోట్ల రూపాయలకు సమానమని పలు మీడియా కథనాలు ప్రచురించాయి.

జగత్ సేథ్ గురించి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిక చరిత్రకారుడు రాబిన్ ఓర్మే ఎంతో గొప్పగా ప్రస్తావించాడు. బ్రిటీష్ పాలన కాలంలోనే.. ప్రపంచంలోనే గొప్ప బ్యాంకర్, డబ్బు మార్చే వ్యక్తి జగత్ సేథ్ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం బెంగాల్ లోని ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చారు.

ఆ కాలపు అంబానీ..

జగత్ సేథ్ బెంగాల్ ఆర్థిక వ్యవహారాలలో చాలా ప్రభావం చూపాడు. అక్కడ నాణేలను ముద్రించే గుత్తాధిపత్యాన్ని దక్కించుకున్నాడని చరిత్రకారులు వెల్లడించారు. అతని బ్యాంకింగ్ నెట్‌వర్క్ కోల్‌కతా, ఢాకా, ఢిల్లీ, పాట్నాల వరకు విస్తరించింది. సుదీప్ చక్రవర్తి అనే చరిత్రకారుడు తన పుస్తకం ‘ప్లాసీ: ది బ్యాటిల్ దట్ చేంజ్డ్ ది కోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’లో జగత్ సెథ్‌ను తన కాలపు అంబానీ అని ప్రశంసించారు.

రూ. 3 కోట్లు ఎగ్గొట్టిన బ్రిటీషర్లు..

జగత్ సేథ్, ఆయన కుటుంబం గురించి చరిత్ర పుస్తకాల్లో లిఖించారు. కానీ ధనవంతుల జాబితాలో ఆయన పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దీనికి ప్రధాన కారణం జగత్ సేథ్ కుటుంబానికి చెందిన ఆస్తులు పూర్తిగా ధ్వంసం కావడమే. బ్రిటీష్ వారి ఆధిపత్యం కారణంగా జగత్ సేథ్ కుటుంబం తన పట్టును కోల్పోయింది. అంతే కాదు, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ జగత్ సేథ్ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదు.

సియార్-ఉల్-ముతాఖేరిన్ ప్రకారం, సిరాజ్‌పై ప్రచారం కోసం జగత్ సేథ్ బ్రిటిష్ వారికి రూ.3 కోట్లు ఇచ్చాడు. కానీ వారు మాత్రం జగత్ సేథ్ తమకు కేవలం రూ.లక్ష మాత్రమే ఇచ్చారని బుకాయించారు. ఆ మొత్తాన్ని కూడా వారు తిరిగి చెల్లించలేదని చరిత్రకారులు వెల్లడించారు. ఆ తర్వాత బ్రిటీష్ వారు క్రమంగా ఆయన ఆస్తులను ధ్వంసం చేసి.. నాశనం చేశారు. ఫలితంగా ఆయన పేరు ధనవంతుల జాబితాలో లేదు అంటారు చరిత్రకారులు.

Show comments