Krishna Kowshik
పరీక్షల్లో వింత ఆన్సర్లు రాయడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. చదవ లేని లేకుంటే.. చదివినా గుర్తుంచుకోలేని విద్యార్థులు.. అటు చీటింగ్, ఇతర స్కిల్స్ వైపు వెళ్లకుండా.. డైరెక్టుగా.. పేపర్ చివరిలో వింత రిక్వెస్టులు పెడుతుంటారు. తాజాగా
పరీక్షల్లో వింత ఆన్సర్లు రాయడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. చదవ లేని లేకుంటే.. చదివినా గుర్తుంచుకోలేని విద్యార్థులు.. అటు చీటింగ్, ఇతర స్కిల్స్ వైపు వెళ్లకుండా.. డైరెక్టుగా.. పేపర్ చివరిలో వింత రిక్వెస్టులు పెడుతుంటారు. తాజాగా
Krishna Kowshik
ఇది పరీక్షల కాలం. సంవత్సరం అంతా చదివిన చదువుకు ఫలితం నిర్దారణయ్యే సమయం. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రమోట్ అవ్వాలన్నా.. ఈ మార్కులే కొలమానం. అందుకు పరీక్ష ముందు రోజు రాత్రంతా చదివి.. తెల్లవారు జామునే లేచి, శ్రద్ధగా పుస్తకాలు పట్టుకుని కుస్తీ పాట్లు పడుతుంటారు విద్యార్థులు. కునుకు పాట్లు పడుతున్నా.. పరీక్షలన్న భయం.. తల్లిదండ్రులు ఎగ్జామ్స్ టైం చదవవా అంటూ పెట్టే అరుపులకు.. చదవక తప్పని పరిస్థితి. అయితే మెరిట్ స్టూడెంట్స్ తొలి నుండి బాగా ప్రిపేర్ అవుతారు కాబట్టి.. ఒకసారి అలా చెక్ చేసుకుంటే.. సరిపోతుంది. మోస్తారుగా చదివే విద్యార్థులు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని గంటలు పాటు చదివి పాస్ మార్కుల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ పరీక్షల ఒత్తిడిలో చదివినా కూడా మర్చిపోతుంటారు కొందరు. అయితే మరికొంత మంది విద్యార్థులు నేర్పుగా చీటీలు పెట్టి చీటింగ్, సైన్ లాంగ్వేజ్‌తో ఫ్రెండ్స్ ఆన్సర్స్ అడిగి రాసేసుకుంటారు. ఇంకొంత మంది క్వశ్చన్ ఒకటైతే.. ఆన్సర్ వాళ్ల ఇష్టం.. అప్పుడే ఏదీ తోచిదే అది.. అవసరమైతే.. సినిమా స్టోరీ, పాటలు కూడా రాసొస్తుంటారు. . కానీ కొంత మంది మాత్రం.. చివరిలో పేపర్ దిద్దే టీచర్‌కు రిక్వెస్ట్ పెట్టుకుంటారు. సార్ కనీసం 35 మార్కులతో పాస్ చేయండని ఆన్సర్ షీట్ చివరిలో రాస్తుంటారు. డబ్బులు పెట్టి అడిగిన వాళ్లున్నారు. అలాగే పాస్ చేయకపోతే లేకుంటే ఆత్మహత్య శరణ్యమంటూ బెదిరించే విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ ఈ ఓ అమ్మాయి మాత్రం వింత వినతి చేసింది. ఆమె ఆన్సర్ చూసి ఇన్విజిలేటర్ అవాక్కయ్యాడు. ఇంతకు ఆ విద్యార్థి ఏం రాసిందంటే..
బీహార్‌లో పదో తరగతి బోర్డు పరీక్షలు జరిగాయి. ఆన్సర్ షీట్లు కరెక్షన్ చేస్తుండగా .. రిక్వెస్టులు చూసి అవాక్కు అవుతున్నారు పేపర్ కరెక్షన్ చేసే టీచర్స్. ఓ యువతి కూడా కచ్చితంగా పాస్ చేయాలని కోరింది. దాని వెనుక ఓ బలమైన రిక్వెస్ట్ కూడా ఉంది. తాను ఫెయిల్ అయితే తన తండ్రి పెళ్లి చేస్తారని, తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పేర్కొంది. తమది చాలా పేద కుటుంబమని, తన తండ్రి వ్యవసాయం చేసి రోజు రూ. 300-400 ఇంటికి తెస్తారని, ఉన్నత చదువులు చదివించే స్తోమత లేదు. ఒక వేళ తాను పరీక్షల్లో ఫెయిల్ అయితే.. తన తండ్రి పెళ్లి చేసేస్తారని, వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, పై చదువులు చదువుకోవాలని వెల్లడించింది. దయచేసి పాస్ చేయండని పేర్కొంది. ఇదిలా ఉంటే.. 12వ తరగతి విద్యార్థి అయితే.. పది రోజుల క్రితం నాన్న చనిపోయాడని, దీంతో చదువుకోలేకపోయానని, తనకు ఒంట్లో బాగోలేదని.. పాస్ చేయండని కోరాడు.