iDreamPost
android-app
ios-app

ఆదిత్య ఎల్ 1 సంపూర్ణ విజయం!

Aaditya-L1:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా సూర్యుడిపైకి ఆదిత్య-ఎల్1పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. సెప్టెంబర్ 2న ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. తాజాగా ఆదిత్య ఎల్1 సంపూర్ణ విజయం సాధించింది.

Aaditya-L1:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా సూర్యుడిపైకి ఆదిత్య-ఎల్1పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. సెప్టెంబర్ 2న ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. తాజాగా ఆదిత్య ఎల్1 సంపూర్ణ విజయం సాధించింది.

ఆదిత్య ఎల్ 1 సంపూర్ణ విజయం!

ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 విజయం సాధించింది. ఇస్రో చరిత్రలోని ఇది మరో మైలు రాయి. గతేడాది సెప్టెంబర్ 2న  నింగిలోకి ఆదిత్య ఎల్-1 వెళ్లింది. విజయవంతగా కక్ష్యలోకి ఆదిత్య ఎల్ -1 ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టారు.  స్పెస్ లో 127 రోజుల పాటు ఆదిత్య ఎల్-1 ప్రయాణించింది. ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. 15 లక్షల కిలో మీటర్లు  ప్రయాణించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది. శనివారం ఇస్రో తన ఆదిత్య-ఎల్1 ను భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 వద్ద ఆర్బిట్ లోకి సక్సెస్ ఫుల్ గా చేర్చింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 ను 2023 సెప్టెంబర్ 2న శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. ఇస్రో సాధించిన ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

భారత పంపిన తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్ 1. సెప్టెంబరు 2న ప్రయోగించగా.. అప్పటి నుంచి 15 మధ్య నాలుగుసార్లు భూకక్ష్య పెంపు విన్యాసాలు చేపట్టారు. సెప్టెంబరు 18 నుంచి శాస్త్రీయ సమాచారం సేకరణ మొదలుపెట్టింది. సెప్టెంబరు 19 సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభించింది. తాజాగా భూమి నుంచి సుమారు 1.5 మిలియన్‌ కి.మీ. దూరంలోని సూర్య-భూమి లగ్రాంజ్ పాయింట్‌ 1 (ఎల్‌1) వద్ద హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 చేర్చబడింది. సెప్టెంబరు 18 నుంచి శాస్త్రీయ సమాచారం సేకరణ మొదలుపెట్టింది.

సెప్టెంబరు 19 సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభించింది. సెప్టెంబర్ 2న తన ప్రయణం మొదలు పెట్టిన ఆదిత్య ఎల్‌1 ఇప్పటి వరకు మూడు నెలల పాటు సాగింది. తాజా విజయంతో ఆదిత్య ఎల్ 1 ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. ఆదిత్య  ఉపగ్రహం ద్వారా ఇస్రో ఎన్నో విషయాలను తెలుసుకోనుంది. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌరజ్వాలల వంటి విషయాలపై స్టడీ చేయనుంది. శనివారం 4.02 గంటలకు కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యను విజయంతంగా ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. ఇక ఆదిత్య విజయంపై దేశంలోని పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపుతున్నారు.