iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పనిచేయడానికి ఇష్టపడట్లేదు: ఇస్రో ఛైర్మన్

  • Author Soma Sekhar Published - 05:43 PM, Thu - 12 October 23
  • Author Soma Sekhar Published - 05:43 PM, Thu - 12 October 23
ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పనిచేయడానికి ఇష్టపడట్లేదు: ఇస్రో ఛైర్మన్

చంద్రయాన్-3 సక్సెస్ తో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది ‘ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్(IRSO)’. ఈ విజయాన్ని చూసి ఇస్రోలో ఖాళీగా ఉన్న పోస్ట్ లకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని అందరూ భావించారు. కానీ దీనికి రివర్స్ గా ఇస్రోలో పనిచేయాలనుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోతోంది. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు.. స్వయానా ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్. ఒకే ఒక్క కారణంతో వారు ఇస్రోలో ఉద్యోగాలపై ఆసక్తి చూపట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నేటి ఆధునిక కాలంలో ఇస్రోలో చేరాలనుకునే వారి సంఖ్య బాగా తగ్గిందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలలైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల నుంచి ఎంతో మంది ప్రతిభావంతులు బయటకి వస్తున్నారు. కానీ వారు ఇస్రోలో చేరడానికి ఇష్టపడటం లేదు. దానికి ఒకే ఒక్క కారణం జీతభత్యాలే అంటున్నారు సోమనాథ్. దేశంలోని ప్రతిభావంతులైన ఇంజినీర్లు, ఐఐటీయన్లుగా ఉండాలి. ఇలాంటి వారు తప్పకుండా ఇస్రోలో చేరాలి కానీ.. నేడు అలా జరగడం లేదు. చాలా మంది ఇస్రోలో ఉద్యోగం కోసం వచ్చి.. శాలరీ గురించి తెలియగానే వెళ్లిపోతున్నారు. ఇలా వందకు 60 శాతం మంది వెనక్కితిరిగి వెళ్లిపోతున్నారని ఆయన తెలిపారు.

కాగా.. ఐఐటీ చేసిన చాలా మంది విద్యార్థులు ఎక్కువ ప్యాకేజీల కోసం చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఇస్రోలో ఉద్యోగులకు భారీగా జీతాలు ఉంటాయని అందరూ భావించే వారని, కానీ గత నెలలో ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఒక ట్వీట్ లో ఇస్రో ఛైర్మన్ జీతం నెలకు రూ. 2.5 లక్షలని, ఇక్కడ ఇంజినీర్ల ప్రారంభ వేతనం దాదాపు రూ. 56, 100 మాత్రమే అని ఆయన తెలిపాడు. మరి ఇస్రోలో ఖాళీలపై సోమనాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.