iDreamPost
android-app
ios-app

చికెన్ షవర్మా తింటే చనిపోతారా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

  • Published May 09, 2024 | 8:18 PM Updated Updated May 09, 2024 | 8:18 PM

చికెన్ షవర్మా ప్రస్తుతం చాలా మందిని కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. అయితే తిన్నవారిలో కొంతమంది ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. కొంతమంది అయితే చనిపోతున్నారు. మరి ఈ చికెన్ షవర్మా తింటే చనిపోతారా? ఎందుకు చనిపోతారు? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

చికెన్ షవర్మా ప్రస్తుతం చాలా మందిని కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. అయితే తిన్నవారిలో కొంతమంది ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. కొంతమంది అయితే చనిపోతున్నారు. మరి ఈ చికెన్ షవర్మా తింటే చనిపోతారా? ఎందుకు చనిపోతారు? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

చికెన్ షవర్మా తింటే చనిపోతారా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

చికెన్ షవర్మా.. ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగా నానుతుంది. ఈ చికెన్ షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురవ్వడం, చనిపోవడం వంటి వార్తలు మనం వింటున్నాం. గత నెలలో ముంబైలోని గోరేగావ్ లో 12 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైన విషయం తెలిసిందే. అంతకు ముందు కేరళలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా ఓ 19 ఏళ్ల కుర్రాడు ఈ చికెన్ షవర్మా తిని అస్వస్థతకు గురయ్యాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో చికెన్ షవర్మా తింటే చనిపోతారన్న భయం మొదలైంది. వరుసగా చికెన్ షవర్మా తిని మరణించే వారి సంఖ్య ఎక్కువవ్వడంతో చాలా మందిలో ఆందోళన ఉంది. పైగా ఈ చికెన్ షవర్మా తిని చనిపోయిన వారిలో ఎక్కువగా 20 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళే ఉండడం గమనార్హం. ఈ చికెన్ షవర్మా తిని అస్వస్థతకు గురవ్వడం, చనిపోవడం చూసి నిజంగానే ఇది తింటే చనిపోతారెమో అన్న సందేహాలు ఉన్నాయి. అసలు చికెన్ షవర్మా తింటే ఎందుకు చనిపోతున్నారు? దీన్ని తింటే చనిపోతారా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? 

అసలు చికెన్ షవర్మా తింటే ఎందుకు చనిపోతున్నారు?

చికెన్ షవర్మా తింటే ఏమీ కాదని.. ప్రాణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వచ్చిన సమస్యల్లా దాన్ని తయారుచేసే విధానం, పరిశుభ్రత విషయంలోనే ఉందని అంటున్నారు. ముఖ్యంగా షవర్మా వండేటప్పుడు చికెన్ సరిగా ఉడకకపోవడం వల్ల గానీ, లేదంటే ఫ్రిడ్జ్ లో సరిగా పెట్టకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందని అంటున్నారు. షవర్మా తయారీలో ఉపయోగించే చికెన్ ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం, నిల్వ ఉంచే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. కొంతమంది మిగిలిపోయిన చికెన్ షవర్మాను ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ మరుసటి రోజు ఉపయోగిస్తారు.

ఈ ప్రాసెస్ లో సరిగా స్టోర్ చేయకపోతే అందులో హానికర బ్యాక్టీరియా చేరుతుందని.. దాని వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందని అంటున్నారు. మరోవైపు సాధారణంగా చికెన్ షవర్మా వండేటప్పుడు చికెన్ ముక్కలను ఒక రాడ్ కి గుచ్చి గంటల తరబడి కాల్చుతూ ఉంటారు. ఎక్కువ సేపు కాలుతూ ఉంటుంది. అయితే దీనికున్న డిమాండ్ కి రద్దీ పెరిగిపోవడంతో కస్టమర్లకు వేగంగా వడ్డించాలన్న ఉద్దేశంతో పూర్తిగా ఉడకని చికెన్ షవర్మాను అందిస్తున్నారు. దీని వల్ల కూడా ఫుడ్ పాయిజన్ సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.