iDreamPost
android-app
ios-app

IPL థీమ్‌ తో పెండ్లి ప‌త్రిక..ఫోటో వైరల్

  • Published Apr 19, 2024 | 4:07 PM Updated Updated Apr 19, 2024 | 4:07 PM

IPL Themed Wedding: జీవితంలో పెళ్లి ఒక్కసారే చేసుకుంటారు.. అతి అందరికీ జీవితాంతం గుర్తుండి పోయేలా నూతన జంట ప్లాన్ చేస్తున్నారు.

IPL Themed Wedding: జీవితంలో పెళ్లి ఒక్కసారే చేసుకుంటారు.. అతి అందరికీ జీవితాంతం గుర్తుండి పోయేలా నూతన జంట ప్లాన్ చేస్తున్నారు.

IPL థీమ్‌ తో పెండ్లి ప‌త్రిక..ఫోటో వైరల్

పెళ్లంటే నూరేళ్ల పంట.. పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ జీవితంలో మరుపురాని మధురమైన అనుభూతి. అందుకే తమ స్థాయిని బట్టి పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ మధ్య పెళ్లి వేడుకలు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇంటి ముందు పందిరి వేసి వివాహవేడుకలు అంగరంగ వైభవంగా జరిపేవారు. కానీ ఇటీవల ట్రెండ్ మారింది.. నిశ్చితారం అయ్యాక ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి కార్యక్రమం ముగిసే వరకు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లి కార్డులు కూడా చిత్ర విచిత్రమైన పద్దతుల్లో ప్రింట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ జంట తమ పెళ్లి కార్డును ఐపీఎల్ థీమ్ తో చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటారు.. అది ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉండాలని ప్రతి జంట కోరుకుంటారు. వివాహ ఆహ్వాన పత్రిక మొదలు పెళ్లి కార్యక్రమం వరకు ప్రతీది ఆహ్వానితులకు గుర్తుండి పోవాలనే ఉద్దేశంతో కొత్త జంట తమ పెళ్లి తంతు వెరైటీ పద్దతుల్లో జరుపుకుంటున్నారు.అలాంటి ఆలోచనతోనే ఓ జంట తమ పెళ్లి పత్రకకు ఐపీఎల్ ను జత చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ కొత్త జంట తమ పెళ్లి పత్రిక ఐపీఎల్ థీమ్ లో ప్లాన్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ కలర్స్.. వధూవరుల పేర్లు, చెన్నై సూపర్ కింగ్ జట్టు లోగో ముద్రించారు. వీటితో పాటు రివ్యూ, మ్యాచ్ ప్రిడక్షన్ అంటూ క్రికెట్ టికెట్ తలపించేలా ఇన్విటేషన్ తయారు చేయించారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సమయంలో ఇలాంటి వెడ్డింగ్ కార్డు రావడంతో తెగ వైరల్ అవుతుంది. వధూవరులకు క్రికెట్ అంటే ఎంత అభిమానం.. అందుకే ఇలా వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్లాన్ చేశారు అంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొంతమంది వెడ్డింగ్ కార్డు ను పట్టుకొని ఫోటోలోకు ఫోజులు ఇస్తూ.. సెల్పీలు తీసుకొని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. కొంతమంది నెటజిన్లు కొత్త జంటను జీవితాంతం సుఖంగా ఉండాలని పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.