Dharani
Inter Results 2024: తాజాగా వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లు అరుదైన ఘనత సాధించి.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. ఆ వివరాలు..
Inter Results 2024: తాజాగా వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లు అరుదైన ఘనత సాధించి.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. ఆ వివరాలు..
Dharani
సాధారణంగా కవలల పిల్లలు అంటే.. నిమిషాల తేడాతో పుడతారు.. ఇద్దరు చూడటానికి ఒకేలా ఉంటారు.. పోలికలు మాత్రమే కాక అలవాట్లు కూడా సేమ్ ఉంటాయి అంటారు. ఇక సినిమాల్లో అయితే కవలల గురించి కాస్త అతిగానే చూపిస్తారు. ఒకరిని కొడితే మరొకరికి దెబ్బ తగలడం.. ఇద్దరూ ఒకేసారి అనారోగ్యం పాలవ్వడం వంటి ఘటనలు చూపిస్తారు. కొందరి విషయంలో ఇలానే జరుగుతుందట. అదలా ఉంచితే ఇప్పుడు మేం మాత్రం ఓ ఆసక్తికర అంశాన్ని చెప్పబోతున్నాం. ఇద్దరూ కవల అక్కాచెల్లెళ్లు సాధించిన అరుదైన ఘనత గురించి ఇక్కడ వివరించబోతున్నాం.
సాధారణంగా కవలలు అంటే చూడ్డానికి ఇద్దరూ సేమ్ ఉంటారు. కానీ వారి అలవాట్లు, అభిరుచులు కాస్త భిన్నంగానే ఉంటాయి. ఏవో కొన్ని విషయాల్లో మాత్రమే వారికి పోలికలు ఉంటాయి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే కవలలు అన్ని విషయాల్లో ఒకేలా ఆలోచిస్తారు. ఆఖరికి చదువు, మార్కుల విషయంలో కూడా. తాజాగా విడుదలైన ఇంటర్ పరీక్షల్లో వీరిద్దరూ ఒకేలా మార్కులు తెచ్చుకుని.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అది కూడా టాప్ మార్కులు కావడం విశేషం.
కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు ఈ ఘనత సాధించారు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్ చుక్కి, ఇబ్బని ఒకే పోలికతో ఉండటమే కాక తాజాగా రిలీజైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషం. 600 మార్కులకు గాను ఇద్దరూ 571 మార్కులు సాధించారు. అంతే కాదు గతంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఇలాంటి మ్యాజిక్కే జరిగింది అంటున్నారు వీరి తల్లిదండ్రులు. పదో తరగతిలో ఇద్దరూ 625 మార్కులకు గాను 620 మార్కులు తెచ్చు కున్నారని తెలిపారు.
ఈ వార్త తెలిసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా కవలలు ఒకేలాగా ఆలోచించడం, ఒకేసారి శారీరక సమస్యలు రావడం చూస్తాం. కానీ పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు రావడం నిజంగా విశేషమే అంటున్నారు. ప్రస్తుతం చుక్కి, ఇబ్బని కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డీఆర్కే పీయూ కాలేజీలో 12వ తరగతిపూర్తి చేశారు. ప్రస్తుతం వీరిద్దరు నీట్‌కోసం సిద్ధమవుతున్నారు. నీట్ ఫలితాన్ని బట్టి ఇంజనీరింగా, మెడిసినా అనేది నిర్ణయించుకుంటారట. ఇక ఈ కవల అక్కాచెల్లెళ్లు కేవలం చదువులో మాత్రమే కాకుండా సంగీతం, డ్యాన్స్, ఆటల్లో కూడా ఇలానే ముందుంటారట.
వీరి తండ్రి వినోద్ చంద్ర తన బిడ్డలు సాధించిన ఘనతపై చాలా సంతోషంగా ఉన్నారు. తన బిడ్డలు సాధించిన మార్కులు తనకు గర్వకారణమని చెప్పారు. ఇబ్బాని లాంగ్వేజ్ లలో తన సోదరి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంన్నారు. సైన్స్, మిగిలిన సబ్జెక్టులలో ఇద్దరికి ఒకటి నుండి రెండు మార్కులే తేడా అన్నారు. వాళ్లిద్దరూ కలిసే పనులు చేసుకుంటారని.. కలిసే చదువుకుంటారని.. ఒకవిధంగా చెప్పాలంటే ఇద్దరూ పుస్తకాల పురుగులు అని గర్వంగా చెప్పుకొచ్చాడు.