iDreamPost
android-app
ios-app

స్లీపర్, AC కోచ్‌లలో ప్రయాణం చేసేవారికి గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు తప్పినట్టే!

  • Published Jul 11, 2024 | 4:08 PM Updated Updated Jul 11, 2024 | 4:08 PM

Indian Railways Brings New Strict Rule To Railway Passengers: ఇక నుంచి వెయిటింగ్ టికెట్ తో మీరు స్లీపర్ కోచ్ లో గానీ, ఏసీ బోగీల్లో గానీ ప్రయాణం చేయలేరు. ప్రయాణం చేస్తే కనుక కఠిన చర్యలు తప్పవు. రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

Indian Railways Brings New Strict Rule To Railway Passengers: ఇక నుంచి వెయిటింగ్ టికెట్ తో మీరు స్లీపర్ కోచ్ లో గానీ, ఏసీ బోగీల్లో గానీ ప్రయాణం చేయలేరు. ప్రయాణం చేస్తే కనుక కఠిన చర్యలు తప్పవు. రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

స్లీపర్, AC కోచ్‌లలో ప్రయాణం చేసేవారికి గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు తప్పినట్టే!

చాలా మంది అప్పటికప్పుడు రైల్వే టికెట్స్ ని బుక్ చేసుకుంటా ఉంటారు. అయితే అప్పటికే సీట్లు బుక్ అయిపోవడం వల్ల టికెట్లు నిర్ధారణ అవ్వవు. దీంతో వెయిటింగ్ టికెట్లు మాత్రమే వస్తాయి. అయితే ఈ వెయిటింగ్ టికెట్ తో కొంతమంది స్లీపర్ కోచెస్ లో, ఏసీ బోగీల్లో ప్రయాణం చేస్తుంటారు. స్లీపర్ కోచ్ లో ప్రయాణం చేసేందుకు వెయిటింగ్ టికెట్ తీసుకున్నా గానీ ఇక నుంచి ఆ కోచెస్ లో ప్రయాణం చేయడం నేరం. తాజాగా ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ టికెట్ తో స్లీపర్ కోచెస్ లో లేదా ఏసీ బోగీల్లో ప్రయాణం చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఇండియన్ రైల్వేస్ హెచ్చరించింది.    

టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు మాత్రమే స్లీపర్ కోచ్ లు, ఏసీ బోగీల్లో ప్రయాణం చేయాలి. టికెట్ నిర్ధారణ కాకుండా ఏసీ కోచ్ లో గానీ, స్లీపర్ కోచ్ లో గానీ ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇండియన్ రైల్వేస్ తాజాగా కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. వెయిటింగ్ టికెట్ తో ఎవరైనా గానీ స్లీపర్ కోచ్ లేదా ఏసీ కోచ్ లో ప్రయాణం చేస్తే వాళ్ళకి జరిమానా విధించి తర్వాత స్టేషన్ లోనే దించేస్తారు. వెయిటింగ్ టికెట్ తో ఏసీ కోచ్ లో ప్రయాణం చేసి దొరికితే 440 రూపాయల జరిమానా, అలానే తర్వాత స్టేషన్ నుంచి అయ్యే ఛార్జీలు కలిపి వసూలు చేస్తారు. అలానే స్లీపర్ కోచ్ లో ప్రయాణం చేస్తూ దొరికితే కనుక 250 రూపాయల జరిమానా, తర్వాత స్టేషన్ కి అయ్యే ఛార్జీ కలిపి వసూలు చేస్తారు. ఈ విషయంలో కఠినంగా తనిఖీలు ఉంటాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది.      

ఇండియన్ రైల్వేస్ తీసుకున్న ఈ నిర్ణయంతో స్లీపర్ కోచ్ లు, ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులకు మేలు చేకూరనుంది. కొంతమంది వెయిటింగ్ టికెట్ తో స్లీపర్ కోచెస్, ఏసీ బోగీల్లో ఎక్కి నానా రభస చేస్తుంటారు. మేమూ టికెట్ బుక్ చేశామంటూ చోటు ఇవ్వమని గోల చేస్తారు. ఏసీ బోగీల్లో ఇలాంటివి తక్కువే గానీ స్లీపర్ కోచెస్ లో మాత్రం ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఇక నుంచి వెయిటింగ్ టికెట్ తో ఎవరైనా ఎక్కితే తప్పు వాళ్ళదే. టీసీకి చెప్తే వాళ్ళని తర్వాతి స్టేషన్ లో దించేస్తారు. మరి ఇండియన్ రైల్వేస్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.