iDreamPost
android-app
ios-app

బియ్యం ఎగుమతులపై కేంద్ర కీలక నిర్ణయం! విదేశాల్లో రైస్ కోసం ఎగబడుతున్న ఇండియన్స్

  • Author Soma Sekhar Updated - 01:21 PM, Sat - 22 July 23
  • Author Soma Sekhar Updated - 01:21 PM, Sat - 22 July 23
బియ్యం ఎగుమతులపై కేంద్ర కీలక నిర్ణయం! విదేశాల్లో రైస్ కోసం ఎగబడుతున్న ఇండియన్స్

ప్రపంచ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశానిది ప్రముఖ స్థానం. వివిధ దేశాలకు బాస్మతి బియ్యంతో పాటుగా ఇతర రకాలకు చెందిన బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది ఇండియా. అయితే గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కీలక ప్రకటనను జారీ చేసింది. బాస్మతి బియ్యం కాకుండా ఇతర బ్రాండ్లకు చెందిన రకాలను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. దాంతో విదేశాల్లో ఉంటున్న భారతీయులు రేట్లు పెరుగుతాయని సూపర్ మార్కెట్ల ముందు బారులు తీరారు. బియ్యం స్టోర్లపై ఎగబడి బియ్యం బస్తాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రపంచ దేశాలకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. గతకొన్ని రోజులుగా దేశంలో కురుస్తున్న వర్షాలకు.. గత 10 రోజుల్లో దేశంలో బియ్యం రేట్లు 20 శాతానికి పైగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం రైస్ రేట్లు పెరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ నిషేధం విధించినట్లు గా తెలుస్తోంది. ఎగుమతుల నిబంధనల విధానంలో భాగంగా.. నాన్ బాస్మతి రైస్ ను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని నిషేధించినట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విభాగం ప్రకటించింది. ఈ ప్రకటనతో దేశంలో 80 శాతం ఎగుమతులపై ప్రభావం పడనుంది.

ఇక ఈ నిర్ణయంతో పలు దేశాలు బియ్యం కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. దాంతో విదేశాల్లో ఉన్న ఇండియన్స్ రైస్ స్టోర్స్ లో బియ్యం బస్తాల కోసం ఎగబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక్క వియాత్నం దేశమే భారతదేశం నుంచి ఈ ఒక్క వారంలోనే అత్యధికంగా బియ్యాన్ని దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతి దశాబ్దంలోనే అధికం కావడం గమనార్హం. అయితే ఈ నిషేధం ఎన్ని రోజులు అమల్లో ఉంటుందో చెప్పలేదు.

కాగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయపై బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు BV కృష్ణరావు మాట్లాడుతూ..”వరి సేకరణ ధరను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారానే బియ్యం రేట్లు పెరుగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలోని సంక్షేమ పథకాలకు అవసరమైన నిల్వలను కలిగి ఉంది. ఎగుమతులను పరిమితం చేయాల్సిన అవసరం లేదు” అంటూ ప్రముఖ పత్రికతో చెప్పుకొచ్చాడు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను తెలియజేయడం.