iDreamPost
android-app
ios-app

రామన్‌ మెగసెసె అవార్డుకి ఎంపికైన భారతీయ వైద్యుడు!

  • Published Sep 01, 2023 | 4:04 PM Updated Updated Sep 01, 2023 | 4:07 PM
రామన్‌ మెగసెసె అవార్డుకి ఎంపికైన భారతీయ వైద్యుడు!

తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే.. ఆపద సమయంలో ప్రాణాలు రక్షించి వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో పోల్చుతుంటారు. ప్రస్తుతం వైద్యం అందని ద్రాక్షలా మారిందని అంటుంటారు. హాస్పిటల్స్ కి వెళ్తే అడ్డగోలుగా డబ్బులు వసూళ్లు చేస్తుంటారు బాధితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎక్కడో అక్కడ లోపాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఓ డాక్టర్ నిస్వార్థంగా గ్రామీణ ప్రాంతల్లో క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవ అందిస్తూ వస్తున్నారు. ఇందుకు గాను ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..

ఆసియా ఖండంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసె అవార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును అందిస్తారు. తాజాగా భారతీయ వైద్యుడు అయిన రవి కన్నన్ మెగసెసె అవార్డుకు ఎంపిక అయ్యారు. గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి సదుపాయాలు లేకున్నా ఎంతో కష్టపడి క్యాన్సర్ రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్నారు డాక్టర్ రవి కన్నన్. ఈ ఏడాదికి సంబంధించి రామన్ మెగసెసె అవార్డు విజేతలను గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వహక కమిటీ ప్రకటించింది. అస్సాంలోని కాచర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కీలకమైన పదవిని వదులుకొని గ్రామీణ ప్రాంత రోగులకు వైద్యం అందించడం మొదలు పెట్టారు.

గత కొంతకాలంగా డాక్టర్ రవి కన్నన్ పేద క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన పద్కశ్రీ తో సత్కరించారు. సర్జికల్ అంకాలజిస్ట్ అయిన డాక్టర్ రవి కన్నన్.. కాచర్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కీలక పదవిలో కొనసాగారు. కానీ పేదలకు వైద్య సేవ అందించాలనే సంకల్పంతో 2007 లో 23 మంది సిబ్బందితో సేవలు ప్రారంభించారు. అప్పటి వరకు క్యాన్సర్ ఖరీదైన వైద్యం అన్న అపోహలను పూర్తిగా తొలగించారు రవి కన్నన్. ఎంతోమంది పేద రోగులకు చికిత్స అందించారు.

ప్రతి సంవత్సరం ఇరవై వేల మందికి క్యాన్సర్ పేషెంట్స్ కి చికిత్స అందించారు. తాము చేయగలిగినంత సేవలు.. సాయం చేస్తు వస్తున్నాం అని పద్మశ్రీ డాక్టర్ రవి కన్నన్ అంటున్నారు. ఇక డాక్టర్ రవి కన్నన్ తో పాటు తూర్పు తైమూర్ కు చెందిన యూజెనియో లెమోస్, ఫిలిప్పిన్స్ కి చెందిన మిరియం కొరినెల్ ఫెర్రర్, బంగ్లాదేశ్ కి చెందినటువంటి కొర్వి రక్షందలకు ఈ విషిష్ట పురస్కారం వరించింది. నవంబర్ 11 న మనీలాలో నిర్వహించే వేడుకలో రామన్ మెగసెసె అవార్డు అందించనున్నారు.