P Krishna
Air Forces Plane Crashes: ఈ మధ్య కాలంలో తరుచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి.
Air Forces Plane Crashes: ఈ మధ్య కాలంలో తరుచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి.
P Krishna
ఇటీవల దేశంలో విమాన ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో సాంకేతిక లోపం, వాతావరణంలో మార్పులు, పక్షులు ఢీ కొట్టడం ఇలా ఎన్నో రకాల ఇబ్బందుల కారణంగా విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ప్రమాదాలను ముందుగానే పైలట్లు పసిగట్టి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రాణ నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వైమానిక దళానికి చెందిన విమానం కుప్ప కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం సాంకేతిక లోపం కారణంగా జరిగిందా? లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే..
భారత ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఓ నిఘా విమానం కుప్పకూలిపోయింది. గురువారం ఉదయం రాజస్థాన్ లో జైసల్మేర్ జిల్లాలో పితాలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ వేధికగా తెలిపింది. సాధారణంగా శిక్షణా సమయంలో విమానాలు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి పరంబీర్ సింగ్ రావల్ట్ మాట్లాడుతూ.. ‘విమానం కుప్పకూలినప్పుడు మేం ట్యూబ్‌వెల్ దగ్గర కూర్చున్నాం.. ఒక్కసీరే పెద్ద శబ్ధం వచ్చి మంటలు చలరేగాయి’ అని అన్నారు.
విమాన ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే విమానంలో మంటలు కాలి బూడిదయ్యింది. కాగా, ఈ విమానాన్ని ఏఐఎష్ నిఘా, గుఢాచారి కార్యాలపాలలకు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఎయిర్ ఫోర్స్ అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Breaking News: जैसलमेर में वायुसेना का टोही विमान क्रैश, जैसलमेर के पिथला गांव के समीप क्रैश हुआ टोही विमान#Jaisalmer #BreakingNews #PlaneCrash #RajasthanWithFirstIndia @IAF_MCC @adgpi @JaisalmerPolice @DmJaisalmer pic.twitter.com/VPdGKEQwgj
— First India News (@1stIndiaNews) April 25, 2024