iDreamPost

వాహనదారులకు బిగ్ షాక్.. టోల్ చార్జీలు పెరిగాయ్..

Toll Plaza Charges Increce:: సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో టోల్ ఫీజ్ ధరలు పెంచుతుండగా ఈ సారి రెండు నెలలు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Toll Plaza Charges Increce:: సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో టోల్ ఫీజ్ ధరలు పెంచుతుండగా ఈ సారి రెండు నెలలు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

వాహనదారులకు బిగ్ షాక్.. టోల్ చార్జీలు పెరిగాయ్..

సాధారణంగటా టోల్ ప్లాజా చార్జీలు పెంచితే సామాన్యులపై మరింత భారం పడుతుందన్న విషయం తెలిసిందే. టోల్ ప్లాజా అంటే జాతీయ రహదారి వెంట వచ్చే వాహనాలు, బ్రిడ్జ్ ఆఫ్ ది గాడ్స్ లోకి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించడానికి వెల్లే వాహనాలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాలో టోల్ పన్ను మొత్తం నాలుగు చక్రాల వాహనాలకు లేదా పెద్ద వాహనాలకు మాత్రమే విధించబడతాయి. తాజాగా వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు జూన్ 3 నుంచి పెరగనున్నాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి టోల్ రుసుము పెంచుతూ ఉంటారు.. కానీ ఈ ఏడాది పలు కారణాల వల్ల పెంపును వాయిదా వేశారు. ఈసారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. చివరి విడత ఎన్నికలు జూన్ 1 తో ముగిశాయి. దీంతో టోల్ ఫీజ్ ధరలు పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టోల్ గేట్ వద్ద టోల్ రుసుములు జూన్ 3 నుంచి పెరగనున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా టోల్ చార్జీలు సగటున 5 శాతం పెరిగాయి. పెంచిన ధరలు 2025 మార్చి 31 వ తేదీ వరకు అమలుల్లో ఉంటాయని నేషనల్ హై వే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

నేషనల్ హై వే పై పెద్ద వాహనాలు, వ్యాన్, జీపులు, ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10.. చిన్నపాటి కమర్షియల్ వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపుల కలిిపి రూ.20, బస్సులు, ట్రక్కులు ఇతర పెద్ద వాహనాలు ఇకవైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపుల ప్రయాణానికి కలిపి రూ.35 పెద్ద ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ. 35, ఇరువైపుల కలిపి రూ.50 వరకు పెంచారు. నెల వారి పాస్ రూ.330 నుంచి రూ.340 కి పెరిగింది. ఇదంగా ఆదివారం అర్థరాత్రినుంచి అమలు కానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి