P Krishna
Indian Flag: దేశంలో మరో రెండు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకులు జరుపుకునేందుకు సిద్దమవుతంది. స్వాతంత్ర దినోత్సవం రోజున చాలా మంది తమ బైకు లేదా కారుపై జాతీయ జెండను ఉంచుతారు. అయితే జెండ ఎగరవేయడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.
Indian Flag: దేశంలో మరో రెండు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకులు జరుపుకునేందుకు సిద్దమవుతంది. స్వాతంత్ర దినోత్సవం రోజున చాలా మంది తమ బైకు లేదా కారుపై జాతీయ జెండను ఉంచుతారు. అయితే జెండ ఎగరవేయడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.
P Krishna
యావత్ భారత దేశం స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల ‘మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. త్రివర్న పతాకంతో తమ సెల్ఫీని harghartiranga.com’లో అప్ లోడ్ చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు.. వారిని ఎప్పటికీ స్మరించుకోవాలని కోరారు. జాతీయ జెండ ఎగరవేయడంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.. అవి ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారు. ఆ నిబంధనలు ఏంటో తెలుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వేడుకులు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ఆ రోజు ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తారు. ఆ రోజు చాలా మంది జాతీయ జెండాకు సంబంధించి బ్యాడ్జీలు ధరిస్తుంటారు. కొంతమంది తమ బైకులు, కార్లపై జెండాను ఉంచుతారు. ప్రతి ఒక్కరూ జెండా ఎగురవేయడానికి అనుమతిలేదన్న విషయం తెలుసా? అవును ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం వాహనాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడం నిర్ధిష్ట వ్యక్తులు చట్టప్రకారం తప్పచేసిన వారవుతారు. వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపే ఛాన్స్ కూడా ఉంది. వాహనాలపై జాతీయ జెండాను ఉంచే అధికారం ఎవరికి ఉందీ అన్న విషయానికి వస్తే.. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా , 2002 ప్రకారం కార్లపై జాతీయ జెండాను ఎగురవేసే హక్కు దేశ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గవర్నర్, లెఫ్ట్ నెంట్ గవర్నర్, ఇండియన్ మిషన్ పోస్టులో చేసే అధిపతులు, ప్రధాన మంత్రి, కేబినెట్, కేంద్ర ఉపమంత్రులు, రాష్ట్ర మంత్రులు, క్యాబినెట్ మంత్రి, కేంద్రపాలిత ప్రాంతం సీఎం, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు జెండా ఎగుర వేయడానికి అర్హులుగా పరిగణించబడ్డారు.
దేశ పౌరులకు ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే హక్కు, తమ చేతుల్లో జెండాను పట్టుకొని తిరిగే హక్కు స్వేచ్చగా ఉంది. కానీ ప్రైవేట్ వాహనాలపై జెండాలు పెట్టి తిరగడం చట్టరిత్యా నేరం. ఎవరైనా ఈ నేరాలకు పాల్పపడితే జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 ప్రకారం అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం జాతీయ జెండా, రాజ్యంగం, జాతీయ గీతం వంటి భారతీయ జాతీయ చిహ్నాలను అవమానిస్తే.. సదరు వ్యక్తికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏ రోజు, ఏ సందర్బంలోనైనా జాతీయ జెండా ఎగురవేయవొచ్చు. జాతీయ జెండా ఎప్పుడు ఎగురవేసినా దానికి గౌరవం ఇవ్వాలి. సరైన స్థలంలో ఉంచాలి. నేలపై, మురికి ప్రదేశంలో ఉంచకూడదు.చిరిగిన జెండా ఎగురవేయకూడదు.