iDreamPost
android-app
ios-app

Foreign Remittance: ఫారిన్ రెమిటెన్స్ రూ.6 లక్షలు దాటితే ఐటీ నిఘా.. ఆపై నోటీసులు

  • Published Aug 14, 2024 | 7:20 AM Updated Updated Aug 14, 2024 | 7:56 AM

IT Notices To Those Persons: చాలా మంది తమ దగ్గరున్న డబ్బుని వివిధ రకాలుగా పేమెంట్స్ చేస్తుంటారు. వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అయితే ఆ పేమెంట్స్ చేసేవారిపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. 6 లక్షలు దాటిన వారికి నోటీసులు పంపనుంది.

IT Notices To Those Persons: చాలా మంది తమ దగ్గరున్న డబ్బుని వివిధ రకాలుగా పేమెంట్స్ చేస్తుంటారు. వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అయితే ఆ పేమెంట్స్ చేసేవారిపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. 6 లక్షలు దాటిన వారికి నోటీసులు పంపనుంది.

Foreign Remittance: ఫారిన్ రెమిటెన్స్ రూ.6 లక్షలు దాటితే ఐటీ నిఘా.. ఆపై నోటీసులు

పన్ను ఎగ్గొట్టేందుకు కొంతమంది అడ్డదారులను తొక్కుతా ఉంటారు. ఖర్చుపెట్టకున్నా సరే లేనిపోని ఖర్చులను చూపించి తక్కువ ఆదాయాన్ని చూపిస్తా ఉంటారు. అయితే ఇప్పుడు పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 6 లక్షలు దాటిన వారి జాబితా తయారు చేసి నోటీసులు పంపాలని నిర్ణయించుకుంది. 6 లక్షలు కంటే ఎక్కువ మొత్తంలో విదేశీ చెల్లింపులు చేసిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. విదేశీ చెల్లింపులలో పన్ను ఎగ్గొట్టేందుకు చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారని ఐటీ శాఖ గుర్తించింది. ఐటీఆర్ లో ప్రకటించిన ఆదాయానికి, విదేశీ చెల్లింపుల డేటాల్లో ఉన్న దానికి అస్సలు సంబంధం ఉండడం లేదన్న అంశాన్ని ఐటీ శాఖ గుర్తించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. టీడీఎస్ లో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించింది.

రెమిటెన్స్ డేటాలో తేడాలు, పన్ను ఎగవేతలను గుర్తించేందుకు విదేశీ లావాదేవీలపై సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకుంది. ఫారమ్ 15సీసీ వెరిఫికేషన్, పరిశీలనను ప్రారంభించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఫీల్డ్ ఫార్మేషన్లను కోరింది. 2016వ సంవత్సరం నుంచి ఈ ఫారం 15సీసీ డేటాను సేకరిస్తున్నారు. గత ఏడాది నాడే ఈ ఫారం 15 సీసీ డేటా సేకరణకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని సూచించారని.. తొలిసారిగా ఫీల్డ్ ఫార్మేషన్ కి అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ చర్య వల్ల రెమిటెన్స్ కేసులను గుర్తించవచ్చునని అధికార వర్గాలు వెల్లడించారు. విదేశీ చెల్లింపులు చేసేవారిలో కొంతమంది ఐటీ శాఖకు సమాచారం ఇవ్వడం లేదని.. ఇప్పుడు అలాంటి వారి వివరాలు బయటపడతాయని తెలిపాయి.

2020-21 ఆర్థిక ఏడాది నుంచి ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న విదేశీ చెల్లింపుల డేటాను పరిశీలిస్తామని.. అధిక రిస్క్ కేసుల జాబితాను తయారు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఐటీ శాఖకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 30 లోపు ఆ జాబితాను అందించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని ఫీల్డ్ ఫార్మేషన్లను ఆదాయపు పన్ను శాఖ ఆదేశించింది. ఐటీ శాఖకు ఎలాంటి సమాచారం అందించకుండా 6 లక్షలు.. అంతకంటే ఎక్కువ విదేశీ చెల్లింపులు చేసిన వారికి నోటీసులు రానున్నాయి. డిసెంబర్ 31వ తేదీ లోపు జాబితాలో ఉన్న వారందరికీ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ట్యాక్స్ నోటీసులు పంపనుంది. ట్యాక్స్ ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుంది.

విద్య, వైద్యం కోసం విదేశాల్లో చేసే ఖర్చులపై మినహాయింపు కల్పిస్తూ లిబరైలైజ్డ్ రెమిటెన్స్ స్కీంని (ఎల్ఆర్ఎస్) తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీం ద్వారా 7 లక్షల రూపాయల లోపు విదేశీ చెల్లింపులపై ఎలాంటి పన్ను ఉండదు. 7 లక్షలు దాటితే టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఫారం 15 సీసీ ద్వారా డిడక్టర్ లేదా రెమిటర్.. విదేశీ చెల్లింపులపై ఫారిన్ రెమిటెన్స్ రిపోర్టింగ్ కింద ట్యాక్స్ విధించబడదని ధృవీకరిస్తే ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే కొంతమంది ఈ సడలింపులు మిస్ యూజ్ చేస్తున్నారని.. అక్రమాలకు పాల్పడుతున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. అందుకే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశాలతో 6 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఎవరైతే విదేశీ చెల్లింపులు చేశారో వారి మీద ప్రత్యేక నిఘా పెట్టారు.