Keerthi
తాజాగా కేరళలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఎంతటి భిభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అక్కడ కొండచరియాలు విరిగిపడటంతో మృతుల సంఖ్య క్రమేపి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా వాతవరణ శాఖ కేరళలో మరో మూడు రోజులు భారీగా వర్షాలు పడనున్నాయని, పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. అలాగే ఆ రాష్ట్రంలో 12 పాఠశాలలు సెలవు ప్రకటించారు.
తాజాగా కేరళలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఎంతటి భిభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అక్కడ కొండచరియాలు విరిగిపడటంతో మృతుల సంఖ్య క్రమేపి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా వాతవరణ శాఖ కేరళలో మరో మూడు రోజులు భారీగా వర్షాలు పడనున్నాయని, పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. అలాగే ఆ రాష్ట్రంలో 12 పాఠశాలలు సెలవు ప్రకటించారు.
Keerthi
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రకృతి కన్నెర్ర చేసినట్లుగా విజృంభించింది. ఇక ఈ భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ముఖ్యంగా ఈ భారీ వర్షాల ధాటికి ఆకస్మిక వరదలు సంభవించడంతో.. కొండచరియలు విరిగిపడి వయనాడ్ ముండక్కై, చూరల్ మల, మెప్పడి ప్రాంతం మొత్తం అతలాకుతలమైంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో 163 మంది మరణించారు. అలాగే 88 మంది మృతదేహాలను గుర్తించారు. వీరిలో 32 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. ఇక అక్కడ సెర్చ్ అండ్ రెస్య్కూ టీమ్స్ సహాయక చర్యలు శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేరళలోని ఈ వర్షాలు ఆగస్టు 3 వరకు భారీగా కురిసే అవకాశం ఉందని తాజాగా ఐఎండీ పేర్కొంది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం 12కు పైగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తాజాగా కేరళలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఎంతటి భిభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అక్కడ కొండచరియాలు విరిగిపడటంతో మృతుల సంఖ్య క్రమేపి పెరిగిపోతుంది. అయితే తాజాగా ఈ వర్షాలు అనేవి ఆగస్టు 3 వరకు భారీగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. బుధవారం మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్గోడ్‌లలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు ఇడుక్కి, త్రిసూర్, ఎర్నాకులం, పాలక్కాడ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఆరెంజ్ అలర్ట్ 24 గంటల్లో 115.6 మిమీ నుంచి 204.4 మిమీ వరకు చాలా భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. అలాగే ఎల్లో అలర్ట్ అంటే 64.5 నుండి 115.5 మిమీ వరకు భారీ వర్షపాతం నమోదవుతుంది.
అయితే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. తిరువనంతపురం , కొల్లాం మినహా 12 జిల్లాల్లో విద్యా సంస్థలకు జూలై 31 (బుధవారం) సెలవు ఉంటుంది. దీంతో పాటు కొట్టాయంలోని ఎంజీ యూనివర్సిటీ, తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీ బుధవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. అలాగే శుక్రవారం వరకు జరగాల్సిన అన్ని పీఎస్సీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఇకపోతే IMD తెలిపిన సమాచారం ప్రకారం.. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌లలో కొన్ని చోట్ల మోస్తరు వర్షం గంటకు 30 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అయితే కేరళలోని మిగతా అన్ని జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక జులై 31 వరకు ఉత్తర కేరళలో గంటకు 35 కి.మీ నుంచి 45 కి.మీ వేగంతో గాలులు, గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక తెలిపింది. కేరళ-కర్ణాటక-లక్షద్వీప్‌లో సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు IMD సూచించింది.