iDreamPost
android-app
ios-app

తెలియని పెళ్లికి వెళ్లి.. భోజనం చేస్తే ఇకపై జైలుకే! ఈ సెక్షన్ తెలుసా?

పెళ్లి అంటే నూరేళ్ల పంట.. అందుకే ఈ వేడుక కోసం తెలిసిన వారందరిని పిలుచుకుంటాం. అయితే కొందరు తెలియని పెళ్లికి వెళ్లి హాయిగా భోజనాలు చేస్తుంటారు. అలాంటి వారు ఇకపై జైలుకే. అలాంటి వారిపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. ఆ సెక్షన్లు ఏంటంటే..

పెళ్లి అంటే నూరేళ్ల పంట.. అందుకే ఈ వేడుక కోసం తెలిసిన వారందరిని పిలుచుకుంటాం. అయితే కొందరు తెలియని పెళ్లికి వెళ్లి హాయిగా భోజనాలు చేస్తుంటారు. అలాంటి వారు ఇకపై జైలుకే. అలాంటి వారిపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. ఆ సెక్షన్లు ఏంటంటే..

తెలియని పెళ్లికి వెళ్లి.. భోజనం చేస్తే ఇకపై జైలుకే! ఈ సెక్షన్ తెలుసా?

ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది  ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. ట్రెండ్ కు తగ్గట్లు తమ వివాహాన్ని జరుపుకునేందుకు యువత ఆసక్తి చూపిస్తింది. ఇలాంటి సమయంలో తమ ఇంట జరిగే పెళ్లికి బంధువులను, స్నేహితులను ఆహ్వానిస్తుంటారు. అంతేకాక పెళ్లికి హాజరయ్యే అతిథులకు వెరైటీ భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. కొందరు అయితే తెలియని పెళ్లికి వెళ్లి భోజనాలు చేస్తుంటారు. ఇప్పటి వరకు అలా చేస్తే నడిచింది..కానీ.. ఇక నుంచి అలా తెలియని వారి పెళ్లికి వెళ్తే.. శిక్ష తప్పదు. ఆ శిక్ష ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

త్రీ ఇడియాట్స్ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరో అమీర్ ఖాన్ తో పాటు అతడి మిగిలిన ఇద్దరు స్నేహితులు ఓ తెలియని పెళ్లికి వెళ్తారు. అక్కడ అతిథుల్లో కలిసి పోయి.. భోజనం చేస్తారు. చివరకు హీరోయిన్ తండ్రికి దొరికిపోతారు. అలా మొత్తానికి ఎలాగో బయట పడతారు. ఇది కేవలం సినిమాలో జరిగిన ఓ సీన్ మాత్రమే. కానీ ఇలాంటి సీన్లు నిజ జీవితంలో కూడా చాలా జరుగుతూనే ఉంటాయి. ఎంతో మంది తమకు తెలియని పెళ్లిళ్లకు వెళ్లి భోజనాలు చేస్తుంటారు. అలాంటి వారికి భవిష్యత్ లో అలానే చేస్తే.. కఠిన శిక్ష తప్పదు.

Marriage

సాధారణంగా మన భారతీయులు పెళ్లంటే తప్పనిసరిగా బంధువులు, స్నేహితులను, అలానే తెలిసిన ఇతర వ్యక్తులు ఇలా ఎంతోమందిని పిలుచుకొని అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు. ఇక పెళ్లి వేడుకలో వెరైటీ ఆహార పదార్థాలు అతిథులకు వడ్డిస్తుంటారు. అలా వచ్చిన వారికి ఎంతో అతిథి మర్యాదలను పెళ్లి వారు చేసేవారు.  పూర్వం పిలిచిన వాళ్లు మాత్రమే పెళ్లికి వెళ్లే వారు. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు అంటే చాలావరకు ఫంక్షన్ హాల్ లో చేసుకుంటున్నారు. అయితే ఈ ఫంక్షన్ హాల్ లకు పిలిచిన బంధుమిత్రులు కాకుండా బయట వ్యక్తులు కూడా ఎక్కువగా హాజరవుతూ ఉంటారు.

ఆ పెళ్లికి వేడుకల్లోకి వెళ్లి హ్యాపీగా ఫుడ్ లాగిస్తూ ఉంటారు. ఇలా వెళ్లిన వాళ్లు ఎవరికీ దొరక్కపోతే బాగానే ఉంటుంది కానీ, ఎవరైనా గమనించి పట్టుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవట. పెళ్లి వారు సహృదయంతో వదిలేస్తే శిక్ష ఏమి ఉండదు. కానీ  ఒకవేళ పెళ్లి వారు సీరియస్ గా తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా అలాంటి వ్యక్తులపై కేసు కూడా నమోదు చేయవచ్చట. పెళ్లివారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఐపిసి సెక్షన్ 441 కింద కేసు నమోదు చేస్తారు.  ఈ క్రమంలో  వారికి 3 నెలల జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందట. కాబట్టి పిలవని పేరంటాలకు వెళ్లి తినేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని పలువురు నిపుణులు చెబుతున్నారు.