Arjun Suravaram
Rohini Sindhuri: ప్రజల తరపున ఎవరు నిలబడిన.. ఆ వ్యక్తి కోసం ప్రజల నిలబడుతుంటారు. అలానే కొందరు తమ జీవితం ప్రజల కోసం అంకితం అనేలా జీవిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎదురయ్యే అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాంటి వారిలో ధీరవనితలు కూడా ఉంటారు. అలాంటి ఓ ధీరురాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Rohini Sindhuri: ప్రజల తరపున ఎవరు నిలబడిన.. ఆ వ్యక్తి కోసం ప్రజల నిలబడుతుంటారు. అలానే కొందరు తమ జీవితం ప్రజల కోసం అంకితం అనేలా జీవిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎదురయ్యే అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాంటి వారిలో ధీరవనితలు కూడా ఉంటారు. అలాంటి ఓ ధీరురాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Arjun Suravaram
మంచి పని చేసిన ప్రతి ఒక్కరినీ జనం గుర్తుపెట్టుకుంటారు. అయితే మంచి పనులు చేయడమే తన విధిగా పెట్టుకుంటే.. అలాంటి వారి వెనుక జనం నడుస్తారు. అది రాజకీయ నాయకుల కావచ్చు అధికారులు కావచ్చు. మాములుగా రాజకీయ నేతల కోసం జనం రోడ్లెక్కెడం మనం చూస్తుంటాము. అయితే అధికారుల కోసం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ప్రజలు బయటకు వస్తుంటారు. అలానే ఓ ఐఏఎస్ అధికారి కోసం జనం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. అంతేకాక ఆమె ఏం చేసిన సంచలనంగా మారేది. ఆమె ప్రతి నిర్ణయం ప్రజల చేత ప్రశంసలు కురిపించేది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. అంతలా గుర్తింపు పొందిన ఆ ఐఏఎస్ మన తెలుగు రాష్ట్రానికి చెందిన రోహిణీ సింధూరి. మరి.. ఆమె ఐఏఎస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
రోహిణీ సింధూరి తల్లి శ్రీలక్ష్మీరెడ్డి బిడ్డ ఆశయాన్ని గుర్తించింది. ఆమె కలను నెరవేర్చాలని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి..ఎదురొడ్డి నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లికి చెందిన దాసరి జయపాల్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె రోహిణీ సింధూరి. అందరి తల్లిదండ్రుల లాగానే రోహిణీ పేరెంట్స్ కూడా ఆమెను ఉన్నత స్థితిలో చూడాలని కలను కన్నారు. ముఖ్యంగా శ్రీలక్ష్మి తన బిడ్డకు అండగా నిలబడి..కలెక్టర్ ను చేసింది. విదేశాలకు వెళ్లమంటే తిరస్కరించి..కలెక్టర్‌నవుతానంటూ మారాం చేసి మరీ సింధూరి కలను నిజం చేసుకుంది. అయితే ఆ క్రమంలో ఆమె ఎన్నో కష్టాలు, సవాళ్ల ఎదుర్కొన్నారు.
తల్లి శ్రీలక్ష్మి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి సింధూరి ఇన్‌స్పైర్ అయింది. తాను కూడ ప్రజలకు సేవచేయాలనుకుంది. అందుకు ఐఏఎస్ బెస్ట్ మార్గం అని ఆమె భావించింది. ఇక తన లక్ష్యం నిరవేర్చుకునే భాగంగా ఆర్.సి.రెడ్డి కోచింగ్ సెంటర్‌లో సివిల్స్‌లో కోచింగ్ తీసుకుంది. మెయిన్స్ కి ఢిల్లీ వెళ్లి.. చివరకు తాను కలలు కన్న ఐఏఎస్ ను సాధించింది. రోహిణీ సింధూరి కర్ణాటక కేడర్‌లో పోస్టింగ్ వచ్చింది. అక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఆమె ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో స్థానికుల ప్రజల నుంచి ఆమెకు పెద్దఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇటీవల రెండు, మూడు ఇష్యూస్‌లో అక్కడి మంత్రులు ఆమెను విభేదించి, బదిలీ చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆమెకు బదిలీ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆమెను బదిలీ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. జనం రోడ్లెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం మూడుసార్లు బదిలీని నిలిపి వేసింది. నిజాయితీ కలిగిన ఓ కలెక్టర్‌ని వేధిస్తే..ప్రజల నుంచి ఎలా స్పందిస్తారో కర్నాటక ప్రభుత్వమే స్వయంగా చూసింది.
అంతేకాక ఆమె ఎంతో సాధారణ వ్యక్తిగా జీవించేందుకు ఇష్టపడుతుంటారు. ఎక్కడ తాను ఓ ఐఏఎస్ అనే అహంకార భావం చూపించలేదు. అందుకు నిదర్శనంగా ఓ చిన్న ఘటనను చెప్పుకొవచ్చు. సింధూరి తన కలెక్టర్ హోదాను పక్కనపెట్టి తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకున్నారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా వైరల్ అయ్యాయి. కలెక్టర్ హోదాలో ఉండి కూడా స్వంతంగా కారు టైర్ మార్చుకున్న కలెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపించారు. ఇలా అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధుల పాలిట సింహ స్వప్నంలా ఆమె నిలిచారు.
అంతేకాక ప్రజల సమస్యలను పరిష్కారిస్తూ, అవినీతిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటూ అక్కడి ప్రజల్లో దేవతలాగా రోహిణీ సింధూరి నిలిచారు. ఇలా పొరుగు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాలకు కీర్తి ప్రతిష్టలు అందిస్తున్న రోహిణీని మనం కూడా అభినందించి తీరాల్సిందే. అంతేకాక ఆమె జీవితం ఎంతో మంది యువతకు ఆదర్శం. మరి.. ఆమె జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.