iDreamPost
android-app
ios-app

ప్రియుడితోనే ఉంటా.. మా ఇద్దరి ఖర్చులు నా భర్తే భరించాలి!: భార్య వింత వాదన!

  • Published Jul 02, 2024 | 12:49 PM Updated Updated Jul 02, 2024 | 12:49 PM

ఈ రోజుల్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువయ్యాయి. భర్త తమకు సమయాన్ని కేటాయించడం లేదని భార్య.. భార్య తనకు పడక సుఖాన్ని ఇవ్వడం లేదన్న కారణంతో భర్త పరాయి వ్యక్తుల మోజులో పడి కాపురాలను కూల్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకోగా.. వింత వాదన చేసింది.

ఈ రోజుల్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువయ్యాయి. భర్త తమకు సమయాన్ని కేటాయించడం లేదని భార్య.. భార్య తనకు పడక సుఖాన్ని ఇవ్వడం లేదన్న కారణంతో భర్త పరాయి వ్యక్తుల మోజులో పడి కాపురాలను కూల్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకోగా.. వింత వాదన చేసింది.

  • Published Jul 02, 2024 | 12:49 PMUpdated Jul 02, 2024 | 12:49 PM
ప్రియుడితోనే ఉంటా.. మా ఇద్దరి ఖర్చులు నా భర్తే భరించాలి!: భార్య వింత వాదన!

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు/అక్రమ సంబంధాలు కామన్ అయిపోయాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరు దీనికి బాధితులవుతున్నారు. భర్త/భార్యల్లో ఒకరు పరాయి వ్యక్తుల మోజులో పడి కుటుంబాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. జీవిత భాగస్వామి దగ్గర లేని ఆనందం, సుఖం మరొకరితో పంచుకునేందుకు సిద్ధం అవుతున్నారు. లవర్స్‌తో ఎంజాయ్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. తమకు నచ్చిన జీవితాన్ని గడిపేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. కాసేపు పడక సుఖం కోసం పరితపించి.. కట్టుకన్న వారిని, కడుపున పట్టిన బిడ్డల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మగవాళ్లే కాదు.. మహిళలు కూడా ఈ విషయంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. ప్రియుడితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని.. బిడ్డల్ని, భర్తను హింసకు గురి చేస్తున్నారు.

తాజాగా ఓ మహిళ.. వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఎంత నచ్చి చెప్పినా వినలేదు. ఈ రచ్చ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు చేరింది. అక్కడ ఆమె చేసిన వింత వాదన చూసి అవాక్కవ్వడం వారి వంతైంది. ప్రియుడితో కలిసి ఉంటానని ఖరాఖండిగా చెప్పింది భార్య. ఇంత వరకు ఓకే కానీ.. ఆమె దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. తన ప్రియుడితో ఉన్నప్పుడు ఇద్దరి ఖర్చులు తన భర్తే భరించాలంటూ వింత ప్రతిపాదన చేసింది. నిజమేనా అనిపించేలా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య వింత డిమాండ్ విని భర్తకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఓ మహిళకు భర్తతో పెళ్లికాగా, ఇద్దరు పిల్లలు కలిగారు. ఆమె మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. భర్తను వదిలేసి.. తన ఇద్దరు కూతుళ్లతో సహా ప్రియుడితో కలిసి జీవిస్తుంది. అయితే తమ ఖర్చు మొత్తం భర్తే భరించాలని డిమాండ్ చేసింది. అయితే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని మొండికేశాడు భర్త.

ఈ విషయం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు చేరింది. అక్కడకు వెళ్లాక కూడా అదే వాదన చేసింది. తన భర్తతో కలిసి ఇక జీవించలేనని, ప్రియుడితోనే ఉంటానని, బిడ్డలు కూడా తనతోనే ఉంటారని పేర్కొంటూ.. ఆ ఖర్చంతా భర్త భరించాలని పేర్కొంది. ఈ బిడ్డలు తన భర్తకు కలిగినందు వల్ల ఆ ఖర్చు ఆమె భరించాలని పేర్కొంది. దీనిపై భర్త మాట్లాడుతూ.. తనతో కలిసి జీవించనప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని నిలదీశాడు. తన ప్రేమికుడితో ఆమె ఉంటే.. తానెందుకు ఖర్చు భరించాలంటూ ప్రశ్నించాడు. అయితే భర్తతో విడిపోవడానికి కారణాలు అడగ్గా.. నిత్యం పని అంటూ తిరుగుతాడని, అస్సలు పట్టించుకోడని, ఆ సమయంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యి.. ప్రియుడిగా మారాడని, అతడికి పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని తెలిపింది. ఇప్పటికే అతడి కుటుంబాన్ని అతడు పోషిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో తన ఖర్చులు, తన కూతుళ్లకు అయ్యే ఖర్చులు భరించలేడని తెలిపింది. అయితే కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తి.. సదరు మహిళ ఆలోచనలు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş