iDreamPost
android-app
ios-app

మరో మహిళతో హోటల్ రూంలో భర్త.. డోరు ఓపెన్ చేస్తే

  • Published Feb 08, 2024 | 12:03 PM Updated Updated Feb 08, 2024 | 2:20 PM

భర్త మరొక స్త్రీతో ఏకాంతంగా గడుపుతుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. ఇప్పుడు అలాంటి ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అయితే ఆమె రాకను ఏ మాత్రం ఊహించని భర్త.. అవాక్కయ్యాడు.

భర్త మరొక స్త్రీతో ఏకాంతంగా గడుపుతుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. ఇప్పుడు అలాంటి ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అయితే ఆమె రాకను ఏ మాత్రం ఊహించని భర్త.. అవాక్కయ్యాడు.

  • Published Feb 08, 2024 | 12:03 PMUpdated Feb 08, 2024 | 2:20 PM
మరో మహిళతో హోటల్ రూంలో భర్త.. డోరు ఓపెన్ చేస్తే

భార్యాభర్తలు అపార్థాలకు తావివ్వకుండా.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే సంసారం అనే నావలో ప్రయాణం హాయిగా సాగిపోతుంది. ఈ బంధం నమ్మకంతో కూడుకున్నది. రిలేషన్ షిప్‌ లో ప్రేమ కోల్పోయినా పర్వాలేదు కానీ.. నమ్మకం కోల్పోతే.. ఆ బంధం ముగుస్తుంది. ఇటీవల విడాకులకు వెళుతున్న కేసులన్నీ అపార్ధాల కన్నా అనుమానాలే ఎక్కువ. పరాయి వ్యక్తులతో పడక సుఖం కోసం కట్టుకున్న జీవిత భాగస్వామిని కించపరుస్తూ.. అవహేళనకు గురి చేస్తున్నారు. భార్య ఏదైనా భరిస్తుంది, ఎంత బాధనైనా సహిస్తుంది. కానీ.. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని తెలిస్తే మాత్రం.. అపర భద్రకాళిలా మారిపోతుంది. అందుకు ఉదాహరణే ఈ సంఘటన.

తనను మోసం చేస్తూ.. మరో మహిళతో సరసాలాడుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిందో ఇల్లాలు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. భర్త మరో మహిళతో కలిసి ఓ హోటల్ రూంలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది భార్య, ఆమె బంధువులకు తెలిసింది. వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో హోటల్ రూంకు చేరుకుని.. భర్తను నిలదీయడంతో పాటు ఆయన ప్రియురాల్ని కొట్టింది. ఈ వీడియోలో అతని పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఓ రూం బుక్ చేసుకున్నారు లవర్స్. చక్కగా రూం అంతా పూలతో, బెలూన్లతో అలంకరించింది ప్రియురాలు. మందు, మగువ పక్కన పెట్టుకుని ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు బర్త్ డే బాయ్.

అంతలో కాలింగ్ బెల్ వినిపించింది. ఎవరని తలుపు తీయగానే.. తెలిసిన వాళ్లు.. ‘ఏం చేస్తున్నారు అంకుల్. హ్యాపీ బర్త్ డే’ అంటూ గదిలోకి దూసుకొచ్చారు. అంతలో వారి వెనుక నుంచి వచ్చిన భార్య.. అతనిపై విరుచుకుపడింది. భర్త కాలర్ పట్టుకుని కొడుతూనే ఉంది. ప్రియురాలిపై కూడా దాడి చేసింది. భార్య వెంట వచ్చిన ఆమె బంధువులు అతడిని చితక్కొట్టారు. ప్రియురాలిని ఈడ్చుకుంటూ రూం బయటకు తోసేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రియురాలు.. ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుండి పోయింది. మరో స్త్రీతో భర్త ఉండటాన్ని నిలదీశారు భార్య, ఆమె తరపు బంధువులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss