iDreamPost

Vote From Home: ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు ఎవరు వేయోచ్చు.. ఎలా అప్లై చేసుకోవాలి?

సార్వత్రిక ఎన్నికల సమరాన్నికి నగారా మోగింది. ఈ క్రమంలో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అయితే అందుకు అర్హులు ఎవరు, ఎలా అప్లయ్ చేసుకోవాలంటే..

సార్వత్రిక ఎన్నికల సమరాన్నికి నగారా మోగింది. ఈ క్రమంలో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అయితే అందుకు అర్హులు ఎవరు, ఎలా అప్లయ్ చేసుకోవాలంటే..

Vote From Home: ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు ఎవరు వేయోచ్చు.. ఎలా అప్లై చేసుకోవాలి?

సార్వత్రిక ఎన్నికలు 2024కు షెడ్యూల్ విడుదలైంది. కొన్ని రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాలు, అభ్యర్థుల ఎంపికలో మునిగిపోయింది. ఇదే సమయంలో ఈ సారి ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఈ  ఓటుకు ఎవరు అర్హులు, ఎలా  దరఖాస్తు చేసుకోవాలి వంటి ఇతర నిబంధనలు వెలువరించింది.

సాధారణంగా ఓటు అనేది ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వేయాలి. అయితే వచ్చే ఎన్నికల విషయంలో ఈసీఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి ఓటును వినియోగించునే అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అర్హులైన వారు 1.37 కోట్ల మంది ఉన్నారని ఇటీవలే ఎన్నికల సంఘం తెలిపింది. వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేసేలా ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఓటు వేయడానికి అర్హుల ఎవరనే విషయం కూడా ఈసీఈ స్పష్టం చేసింది. 85 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచి ఓటు వేసేందుకు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

voter id

దేశంలో 40 శాతానికి మంచి వైకల్యం కలిగి ఉన్నవారు 88.4 లక్షల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అలానే 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో 100 ఏళ్లకు పైబడిన వారు 2.18 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. వీరందరికీ  2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించున్నారు. ఇక ఓట్ ఫ్రమ్ హోంలో భాగంగా ఎన్నికల సిబ్బందే.. అర్హులైన ఓటరు ఇంటి వద్దకే వెళ్లి ఓటు వేయింస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికల రూల్స్ అనుగుణంగా ఈవీఎంను వారి ఇంటికే తీసుకెళ్లనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లోపు ఓట్ ఫ్రమ్ హోం కోసం అర్హులైన వారు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని  కోసం ఎన్నికల ఫారమ్ 12డీ నింపి రిటర్నింగ్‌ అధికారికి లేదా సహాయ రిటర్నింగ్‌ అధికారికి గానీ అందించాల్సి ఉంటుంది. ఇక ఈ ఓటు కోసం అప్లయ్ చేసుకునే వారు తమ పూర్తి అడ్రస్, ఫోన్‌ నంబర్ అందులో నింపాలి. ఇక వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారు ఓటు ఫ్రమ్ హోం కి అర్హులా కాదా అనేద విషయాన్ని నిర్ధారించి..పై అధికారులకు నివేదిక అందిస్తారు. ఇలా అర్హులైన వారి ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయించుకుంటారు. పోలింగ్‌ స్టేషన్‌లో ఎలాగైతే రహస్య ఓటింగ్‌ ఉంటుందో ఓటు ఫ్రమ్ హోం లో కూడా అలాంటి చర్యలే తీసుకోనున్నారు. మరి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి