iDreamPost
android-app
ios-app

వీడియో: డ్రైనేజి పనులు చేస్తుండగా కుప్పకూలిన భవనం! అందులోని..

ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో భవనాలు కూలిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో డ్రైనేజీ పనులు చేస్తుండగా ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆ ఇంట్లోని వాళ్లు...

ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో భవనాలు కూలిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో డ్రైనేజీ పనులు చేస్తుండగా ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆ ఇంట్లోని వాళ్లు...

వీడియో: డ్రైనేజి పనులు చేస్తుండగా కుప్పకూలిన భవనం! అందులోని..

అప్పుడప్పుడు భవనాలు కూలిపోయిన ఘటనలు మనం అనేకం చూస్తుంటాము. వివిధ కారణాలతో పెద్ద పెద్ద భవనాలు కుప్పుకాలిపోతుంటాయి. వరదల, ఇతర తవ్వకాలు, అలానే పేలుళ్ల ధాటికి ఇలా భవనాలు పేక మేడల్లా కూలిపోతుంటాయి. ఇలాంటి ఘటనల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అంతేకాక ఎంతో మంది వికలాంగులుగా మారి జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా పుదుచ్చేరిలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. డ్రైనేజీ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  పూర్తి  వివరాల్లోకి వెళ్తే..

పుదుచ్చేరిలోని అట్టుపట్టి ప్రాంతంలో సోమవారం డ్రైనేజి పనుల్లో భాంగా కాలువను తవ్వుతున్నారు. ఇదే సమయంలో కాలువకు పక్కనే ఉన్న  ఓ చిన్నపాటి భవనం కుప్పకూలింది.  ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల ఉన్నవారంతా ప్రమాద స్థలానికి దూరంగా పరిగెత్తడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అలానే ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం ప్రాణాపాయం తప్పింది.  ఇటీవల, చెన్నైలోని మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఆర్‌టిఎస్) నిర్మాణ స్థలంలో, ఏర్పాటు చేస్తున్న గర్డర్ జారి నేలపై పడిపోయింది. ఆదంబాక్కం సమీపంలోని వెలచ్చేరి మరియు సెయింట్ థామస్ మౌంట్ మధ్య అదనపు ఎంఆర్టీఎస్ లైన్ నిర్మాణంలో భాగంగా ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు.

అలానే శనివారం, సిమ్లాలో ధామి అనే ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం పేకమేడలా కూలిపోయింది. కొండ చరియలు విరిగి దానిపై పడటంతో  ఆ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. భవనం రోడ్డుపై పడిపోవడంతో ఆ ప్రాంతంలో రద్దీ ఏర్పడింది. ఇది ప్రభుత్వ కాలేలు, ఇతర ఆఫీసులకు వెళ్లే రహదారి కావడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ, నివాసితులందరినీ ముందుగానే ఖాళీ చేయించినందున ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అదే విధంగా భవనంలోని విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో ఎలాంటి హాని జరగలేదు.

ఈ సంఘటన మరహ్వాగ్ గ్రామంలోని శనివారం మధ్యాహ్నం సమయంలో జరిగింది. రాజ్ కుమార్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు మునిగిపోతోందని, భవనం బేస్ కాలమ్‌లు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ భవనం కూలిపోతుందని ఊహించి ఖాళీ చేయబడింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిశాంత్ మాట్లాడుతూ ఈ ఇంటి పైన ఉన్న కొండ ప్రాంతంలో తవ్వకం పనుల కారణంగా భవనం కూలిపోయిందని తెలిపారు. తాజాగా పుదుచ్చేరిలో  డ్రైనేజి పనులు చేస్తుండగా భవనం కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.