iDreamPost
android-app
ios-app

భారీగా పెరిగిన హోటల్ రూమ్ రేట్లు.. ఒక రాత్రికి లక్ష.. అంతా అంబానీ మహిమ

  • Published Jul 15, 2024 | 11:13 AMUpdated Jul 15, 2024 | 11:13 AM

Hotel Room Rates Increases: హోటల్ రూమ్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఒకరోజుకి కాదు.. ఒక రాత్రి హోటల్ రూమ్ లో బస చేసినందుకు లక్ష రూపాయలు చెల్లించాలి. ఇంతలా హోటల్ రూమ్ ధరలు పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

Hotel Room Rates Increases: హోటల్ రూమ్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఒకరోజుకి కాదు.. ఒక రాత్రి హోటల్ రూమ్ లో బస చేసినందుకు లక్ష రూపాయలు చెల్లించాలి. ఇంతలా హోటల్ రూమ్ ధరలు పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

  • Published Jul 15, 2024 | 11:13 AMUpdated Jul 15, 2024 | 11:13 AM
భారీగా పెరిగిన హోటల్ రూమ్ రేట్లు.. ఒక రాత్రికి లక్ష.. అంతా అంబానీ మహిమ

గతంలో పెళ్లిళ్లు అంటే చుట్టాలు వచ్చి నెల రోజుల పాటు ఉండేవారు. నెల రోజుల పాటు వాళ్ళు ఉండడానికి విడిది ఇళ్లను ఏర్పాటు చేసేవారు. రాత్రి డాబా మీద కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయి పొద్దున్నే పెళ్లి పనులు చక్కబెట్టేవారు. పల్లెటూర్లలో ఇప్పుడూ ఇదే పద్ధతి కొనసాగుతుంది. కాకపోతే అంతకు ముందులా నెల రోజులు ఉండడం లేదు. ఒక వారం ముందు వస్తున్నారు అంతే. కొంతమంది అయితే ఒకరోజు ముందు వస్తారు. అయితే వీళ్లంతా ఉండడానికి విడిది ఇళ్ళు ఏర్పాటు చేస్తారు. పల్లెటూర్లు, పట్టణాల్లో అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో పెళ్లింటి వారి చుట్టాలు ఉండడానికి ఒప్పుకుంటారు. మరి హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లో పరిస్థితి ఏంటి? అక్కడ చుట్టాలు ఉండరు కదా. చచ్చినట్టు హోటల్స్ లోనే ఉండాలి.

సామాన్య, మధ్యతరగతి వాళ్ళు అంటే చిన్న చిన్న హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకుంటారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు అంటే లగ్జరీ హోటల్స్ లోనే బుక్ చేసుకుంటారు. ఒక రాత్రి ఉండడానికి 10 వేలు, 20 వేలు అయినా గానీ భరిస్తారు. అయితే అలాంటి హోటల్స్ రూమ్ ధరలు కూడా ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు చేసేశారు. ఒక్క రాత్రి ఉండడానికి లక్ష రూపాయలా? 10 వేలు ఎక్కడా లక్ష రూపాయలు ఎక్కడా? మరీ ఇంత దారుణంగా పెంచేస్తారా? అంటే అక్కడ ఉన్నది ముఖేష్ అంబానీ మరి.   

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఈ నెల 12న జరిగిన సంగతి తెలిసిందే. కాగా వీరి వివాహానికి భారీ ఎత్తున సెలబ్రిటీలు వచ్చారు. సెలబ్రిటీలు, ప్రముఖులు భారీగా వస్తారని తెలిసే ఆయా హోటల్స్ అన్నీ రూమ్స్ ధరలను పెంచేశాయి. అప్పటికే రూమ్స్ బుక్ అయిపోయాయని పలు ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నాయి. మామూలు రోజుల్లో ముంబైలో ఫైవ్ స్టార్ హోటల్స్ లో రూమ్ ధర ఒక రాత్రికి రూ. 13 వేలు ఉంటుంది. అయితే అనంత్ అంబానీ పెళ్లి వంకన ఏకంగా లక్షకు పెంచేశాయి. ఒక రాత్రికి రూమ్ లో బస చేసినందుకు రూ. లక్ష చెల్లించుకోవాలి. అయితే ఫైవ్ స్టార్ హోటల్స్ ఇలా ధరలు పెంచడం అనేది ఇదేమీ తొలిసారి కాదు.. గతంలో బెంగళూరులో ఏరో షో జరిగినప్పుడు కూడా జరిగింది. అక్కడున్న హోటల్స్ ఉన్న దాని కంటే భారీగా ధరలను పెంచేశాయి. ఆటో ఎక్స్ పో సమయంల ఢిల్లీ, గురుగ్రావ్ లో కూడా రేట్లను పెంచేశారు. సీజన్ ని బట్టి రూమ్ ధరలను పెంచేస్తుంటాయి హోటల్స్. తాజాగా అంబానీ ఇంట పెళ్లి వేడుకను ఇలా క్యాష్ చేసుకున్నాయి ఆయా హోటల్స్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి