iDreamPost
android-app
ios-app

Video: బీభత్సమైన వాన.. భారీ హోర్డింగ్ కూలడంతో ఘోరం!

ఈమధ్య కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే వానలు దంచికొడుతున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో హోర్డింగ్ కూలడంతో దారుణం చోటుచేసుకుంది.

ఈమధ్య కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే వానలు దంచికొడుతున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో హోర్డింగ్ కూలడంతో దారుణం చోటుచేసుకుంది.

Video: బీభత్సమైన వాన.. భారీ హోర్డింగ్ కూలడంతో ఘోరం!

ఇటీవల రెండు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే వానలు దంచికొడుతున్నాయి. బుధవారం హైదరాబాద్ నగరంలో వాన భీభత్సం సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. అలానే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పంజాబ్ లో ఓ ఘోరం జరిగింది. భారీ హోర్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పంజాబ్ లోని మొహాలి ప్రాంతంలోని జిరాక్ పూర్ లో భారీగా ఉన్న ఓ హోర్డింగ్ కూలిపోయింది. బుధవారం రాత్రి ఆ ప్రాంతంలో భారీగా వాన కురిసింది. అదే సమయంలో జిరాక్ పూర్ ప్రాంతంలోని స్థానిక మార్కెట్ వెలుపల పార్క్ చేసిన కార్లు ధ్వంసం అయ్యాయి. పెద్ద పెద్ద ఈ గాలులకు ఆ భారీ హోర్డింగ్ కుప్పకూలిపోయింది. దీంతో మార్కెట్ వెలుపల పార్కింగ్ చేసి ఉన్న ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన మయంలో వర్షం కురుస్తుండటంలో ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరు  లేరు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.  హోర్డింగ్ పడటం కార్లు పాడైన విధానం చూస్తే ప్రమాదా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైతుంది. ఐదు కార్లు పూర్తిగా ధ్వంసంపై రిపైర్ కి కూడా పనికి రాకుండాపోయాయి. దీంతో  బాధితులు తీవ్ర ఆవేదన చెందారు.

అలానే గతంలో హోర్డింగ్ లు కూలిన ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల క్రితం ముంబైలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ముంబై నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. తుఫాను కారణంగా 250 టన్నుల బరువున్న 100 అడుగుల ఎత్తయిన ఇనుప హోర్డింగ్ కూలి .. సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ పై పడింది. అదేసమయంలో ఆ బంక్ లో పని చేస్తున్న సిబ్బందితో సహా మొత్తం 34 మంది అక్కడికక్కేడే చనిపోయారు. దాదాపు 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరి.. ఇలా హోర్డింగ్ ప్రమాదా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా కాలం చెల్లిన వాటిని వెంటనే తొలగించాలనే జనం డిమాండ్ చేస్తున్నారు. అలానే హోర్డింగ్స్ ఏర్పాటులో నాణ్యతను పాటించాలని కోరుతున్నారు.