iDreamPost
android-app
ios-app

ఇష్టమొచ్చిన నంబర్ ప్లేట్ వాడుతున్నారా? రూ.10 వేలు కట్టాల్సిందే..!

నెంబర్ ప్లేట్స్ ఈ మద్య చాలా మంది రక రకాల డిజైన్లు, ఫాంట్స్ వాడుతున్నారు. నంబర్ ప్లేట్లు చట్టరీత్య విరుద్ధం.. భారీగా జరిమానా కూడా విధిస్తారు.

నెంబర్ ప్లేట్స్ ఈ మద్య చాలా మంది రక రకాల డిజైన్లు, ఫాంట్స్ వాడుతున్నారు. నంబర్ ప్లేట్లు చట్టరీత్య విరుద్ధం.. భారీగా జరిమానా కూడా విధిస్తారు.

ఇష్టమొచ్చిన నంబర్ ప్లేట్ వాడుతున్నారా? రూ.10 వేలు కట్టాల్సిందే..!

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగాపెరిగిపోతున్నాయి. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు. కొంతమంది తమ వాహనాలు నెంబర్ ప్లేట్స్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రక రకాల డిజన్లతో నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే గుర్తించలేకపోతున్నారు. వీటన్నింటికి చెక్ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మీ వాహనాలకు మీరు ఫ్యాన్సీ, స్టైలిష్ నంబర్ ప్లేట్లు వాడుతున్నారా..? మీ అభిమాన సెలబ్రిటీలు, మీ ఇంటి పేర్లు లేదా మీకు నచ్చిన్న పేర్లు వచ్చే విధంగా మీ నంబర్ ప్లేట్లు డిజైన్ చేయించుకున్నారా? అయితే.. మీ కొంపముంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమయింది.

ఈ మధ్య కొంతమంది తమ వాహనాలకు నెంబర్ ప్లేట్స్ రక రకాల డిజైన్స్ వేస్తున్నారు. సాధారణంగా 8055 (బాస్), 4141(పాప, దాదా), 3715(కింగ్), ఇలాంటి పేర్లు కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి నెంబర్ ప్లేట్ పై 5 నుంచి 10 వేలా వరకు ఫైన్ విధిస్తారు అని చాలా మందికి తెలీదు. ఈ నంబర్ ప్లేట్లు చట్టరీత్య విరుద్ధం. ఇక విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం 31 డిసెంబర్ 2022 వరకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) ఏప్రిల్ 1, 2019 కంటే ముందు రిజిస్టర్ చేసిన అన్ని ద్విచక్ర వాహనాలుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది ఈ నిబంధన పాటించడం లేదు. అంతేకాదు వాహనాలపై విభిన్న డిజైన్లతో కూడిన ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. మీ వెవికల్ పై హెచ్ఎస్ఆర్‌పీ ప్లేట్ లేకపోతే, వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోండి. మోటారు వాహన చట్టం ప్రకారం, వాహనాలు తప్పనిసరిగా హెచ్‌ఎస్‌ఆర్‌పి, కలర్ కోడెడ్ స్టిక్కర్‌లను కలిగి ఉండటం తప్పనిసరి.

 

ఈ  నెంబర్ ప్లేట్ ని హెచ్ఎస్ఆర్‌పీ అల్యూమినియంతో తయారు చేస్తారు.  ఇవి కనీసం ఒక్కసారి ఉపయోగించిన స్నాప్-ఆన్ లాక్‌ల ద్వారా వాహనం ముందు, వెనుక భాగంలో ఇన్‌స్టాల్ చేయబడతాయి. దీని మందం 1 మిమీ కలిగివుండి, సంఖ్యలు, అక్షరాలు, బార్డర్ పై హాట్-స్టాంప్డ్ ఫిల్మ్ ఉంటుంది . ఇందులో ‘INDIA’ అని 45 డిగ్రీల కోణంలో రాసి ఉంటుంది. ప్లేట్‌లోని సంఖ్యలు, అక్షరాలు ప్రత్యేక ఫాంట్లో ఉంటాయి. వాటిపై కాంతి పడినప్పుడు సంఖ్యలు, అక్షరాలు ప్రకాశిస్తాయి. దీంతో సీసీటీవీ కెమెరాల్లో సులువుగా కనుగొనే ఛాన్స్ ఉంటుంది. ప్లేట్ ఎగువ ఎడమ మూలలో నీలం రంగులో ఉన్న అశోక చక్రం హాట్-స్టాంప్డ్ క్రోమియం ఆధారిత హోలోగ్రామ్‌ను కలిగివుంటుంది. దీని క్రింద, 10 అంకెల రహస్య కోడ్ (PIN) ఎడమ మూలలో లేజర్‌తో రాసి ఉంటుంది. ప్లేట్‌లోని నంబర్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు. ఒకే వాహనం ముందు, వెనుక నంబర్ ప్లేట్లలో ఈ సంఖ్య భిన్నంగా ఉంటుంది. ఈ రహస్య కోడ్‌లో వాహనానికి సంబంధించిన ఛాసిస్, ఇంజిన్ నంబర్, కొనుగోలు తేదీ, వాహనం మోడల్, డీలర్, రిజిస్ట్రేషన్ అథారిటీ మొదలైన అన్ని వివరాలు ఉంటాయి. కారులో, ఈ రెండు కోడ్‌లు రంగు పూతతో కూడిన స్టిక్కర్‌పై కూడా రాసి ఉంటుంది.

కాబట్టి హెచ్ఎస్ఆర్‌పీ నంబర్ ప్లేట్ తప్పనిసరి. దీని ధర వెవికల్ కేటగిరి, బ్రాండ్ ని బట్టి రూ. 100 నుంచి 500 వరకు ఉంటుంది. కార్లకు, ఇతర పెద్ద వాహనాలకు ధర రూ. 1100 నుంచి రూ. 1200 వరకు ఉంటుంది. ఒకవేళ మీ వాహనం పాతది అయినట్లయితే ఆన్లైన్ లోహెచ్ఎస్ఆర్‌పీకి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ, మీ వాహనం దొంగిలించబడిన, దానిపై హెచ్‌ఎస్‌ఆర్‌పి ఈజీ అవుతుంది. అదే సమయంలో, నేర కార్యకలాపాలకు హెచ్ఎస్ఆర్‌పీ లేని వాహనాన్ని ఉపయోగించడం సులభం. అందువల్ల, వాహనం ఏదైనా కావచ్చు, దానిపై హెచ్ఎస్ఆర్‌పీ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి. ఇకనైనా ఫేక్, రోడ్ సైడ్ నంబర్ ప్లేట్లకు స్వస్తి పలికి ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి