iDreamPost
android-app
ios-app

Ayodhya Temple:అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన కార్డు చూశారా? జన్మ ధన్యం!

  • Published Jan 04, 2024 | 4:29 PM Updated Updated Jan 04, 2024 | 4:29 PM

దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభ ఉత్సవ వేడుకలు చకచకా జరగనున్నాయి. అయితే తాజాగా ఈ రామ మందిర ఉత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అందులో ఏం ఉంది అంటే..

దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభ ఉత్సవ వేడుకలు చకచకా జరగనున్నాయి. అయితే తాజాగా ఈ రామ మందిర ఉత్సవ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అందులో ఏం ఉంది అంటే..

  • Published Jan 04, 2024 | 4:29 PMUpdated Jan 04, 2024 | 4:29 PM
Ayodhya Temple:అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన కార్డు చూశారా? జన్మ ధన్యం!

దేశవ్యాప్తంగా ప్రజలు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  దశాబ్ద కాలం నుంచి హిందువుల కల తీరే శుభ సమయం ఆసన్నం అవుతోంది. మరి కొన్ని రోజుల్లో ఆ కొందాడ రాముడు తన జన్మ భూమిలో కొలువుదీరనున్నాడు. కాగా, ఆ శ్రీ రాముని దర్శన భాగ్యం ఎప్పుడు దక్కుతుంద అని కోట్లాది మంది భక్తులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ రామలయ ప్రారంభోత్సవ వేడుకను ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగనుంది. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆలయ ట్రస్ట్ దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. అయితే తాజాగా అయోధ్య రామ మందిరం వేడకులకు సంబంధించిన ఆహ్వాన పత్రిక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రామాలయ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలు విశేషాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలమంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపించడం జరిగింది. తాజాగా రామ మందిరంకు సంబంధించిన ఆహ్వాన పత్రిక వీడియోను జాతీయ దూరదర్శన్ ఎక్స్ ఖాతాలోషేరు చేసింది. ఇక ఆ కార్డ్ మొదటి పేజీలో “న్యూ గ్రాండ్ టెంపుల్ హోమ్‌లో రామ్ లల్లా తన జన్మ స్థానంలో తిరిగి వస్తున్నందుకు శుభ వేడుక” అంటూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కాలక్రమం, దశల వివరాల గురించి ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

ఇక అయోధ్య రామలయంలో గర్భగుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు మకర సంక్రాంతి తర్వాత రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే జనవరి 16న సరయూ నది నీటితో రామ మందిర శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఆ తర్వాత 22 వ తేదీ మధ్యాహ్నం బాల రామ విగ్రహ ప్రతిష్టను నిర్వహించనున్నారు. కాగా, ఈ కార్యక్రమం కోసం దాదాపు 6,000 ఆహ్వాన కార్డులను ప్రముఖ వ్యక్తులకు పంపించారు. ఇక ఈ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు హాజరుకానున్నారు. మరి, అయోధ్య రామ మందిరం ఆహ్వాన పత్రిక పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.