iDreamPost
android-app
ios-app

హజ్ యాత్రలో ఆగని విషాదాలు! మృతుల్లో పెరుగుతున్న భారతీయులు సంఖ్య!

తమ జీవితంలో ఆధ్యాత్మిక ప్రాంతమైన మక్కాను ఒక్కసారైనా సందర్శించాలనుకునుకుంటాడు ప్రతి ముస్లిం. బక్రీద్ మాసంలో ఎక్కువగా ఈ హజ్ యాత్ర చేస్తుంటారు. కానీ ఈ సారి ఈ యాత్ర..

తమ జీవితంలో ఆధ్యాత్మిక ప్రాంతమైన మక్కాను ఒక్కసారైనా సందర్శించాలనుకునుకుంటాడు ప్రతి ముస్లిం. బక్రీద్ మాసంలో ఎక్కువగా ఈ హజ్ యాత్ర చేస్తుంటారు. కానీ ఈ సారి ఈ యాత్ర..

హజ్ యాత్రలో ఆగని విషాదాలు! మృతుల్లో పెరుగుతున్న భారతీయులు సంఖ్య!

ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం మక్కా. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రాంతంగా భావిస్తుంటారు. ఇక్కడకు వెళ్లి రావడాన్నే హజ్ యాత్ర అంటారు. సౌదీ అరేబియాలో ఉంది ఈ ప్రాంతం. గతంలో ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉండటంతో అక్కడికి యాత్రికుల తాకిడి తక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రతి దేశం, ప్రధాన నగరాల నుండి రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది.  భారత్ నుండి కూడా ఈ యాత్రకు వేలాది మంది తరలివెళుతుంటారు. ఏటా లక్షల మంది ఆ ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. బక్రీద్ మాసంలో ఈ యాత్ర ఉండటంతో తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే సౌదీ అరేబియాలో ఈ ఏడాది ప్రతికూల వాతావరణం నెలకొంది.

ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో హజ్ యాత్ర కాస్త విషాద యాత్రగా మిగిలింది. ఈ సారి హజ్ యాత్రలో సుమారు 550 మందికి పైగా యాత్రికులు మరణించారని తెలిపారు. ఇందులో సుమారు 68 మంది భారతీయులు మరణించినట్లు తెలుస్తుంది. అత్యధికంగా ఈజిప్షియన్లు 323 మంది మరణించారని అధికారిక వర్గాలు వెళ్లడించాయి. 60 మంది జోర్డానియన్లు ఉన్నారు. అలాగే మరణించిన వారిలో ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ఇరాక్, ట్యునీషియాతో పాటు ఇతర దేశాల నుండి కూడా యాత్రికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ హజ్ యాత్రను వృద్దులు చేస్తుంటారు. మరణించిన వారిలో వృద్దులే అత్యధికలని సమాచారం. కొందరు వృద్ధాప్య సమస్యలతో మరణిస్తే.. మరికొందరు అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా చనిపోయినట్లు సమాచారం.

వీరంతా ఉక్కపోత, వడదెబ్బ తగిలి మరణించినట్లు దౌత్యవేత్తలు చెబుతున్నారు. ప్రతి ఏటా బక్రీద్ మాసంలో లక్షలాది మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళుతుంటారు. దీంతో అక్కడ ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఉంటారు. ఈ సారి యాత్రలో 18.3 లక్షలు పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన వారున్నారని సౌదీ హజ్ నిర్వాకులు వెల్లడించారు. అయితే ఈ ఏడాది అక్కడ ప్రతికూల వాతావరణం నెలకొంది. విపరీమైన ఎండ వేడి, ఉక్కపోత తీవ్ర స్థాయికి చేరింది. దీంతో వడదెబ్బ తగిలి యాత్రికులు మరణించారు. అలాగే కొంత మంది జాడ కూడా కానరాలేదని తెలుస్తుంది. కొంత మంది ఆసుపత్రి పాలయ్యినట్లు సమాచారం. అయితే సౌదీ ప్రభుత్వం యాత్రకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడంతో పలువురు మరణించారు. మంగళవారం మక్కాలో 51.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం.