iDreamPost
android-app
ios-app

పిల్లల బాటలోనే తల్లిదండ్రులు! లగ్జరీ లైఫ్ వదలి సన్యాసంలోకి

  • Author Soma Sekhar Published - 03:24 PM, Thu - 24 August 23
  • Author Soma Sekhar Published - 03:24 PM, Thu - 24 August 23
పిల్లల బాటలోనే తల్లిదండ్రులు! లగ్జరీ లైఫ్ వదలి సన్యాసంలోకి

‘ధన మూలం మిదం జగత్’.. ‘పైసా మే పరమాత్మ’ అన్నారు పెద్దలు. దీంతో చిన్నతనం నుంచే డబ్బు సంపాదించి, ఎలాంటి కష్టాలు లేకుండా బతకాలని అందరూ కోరుకుంటారు. జీవితాన్ని లగ్జరీగా అనుభవించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఈ దంపతులు మాత్రం వందల కోట్ల ఆస్తిని, లగ్జరీ లైఫ్ ను వదులుకుని సన్యాసం తీసుకున్నారు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజం. గుజరాత్ కు చెందిన డైమండ్ వ్యాపారి, అతడి భార్య తమ యావదాస్తిని వదిలి సన్యాసం స్వీకరించారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? వీరి ఇద్దరు పిల్లలు కూడా ఆస్తిని వదిలేసి సన్యాసం స్వీకరించారు.

గుజరాత్ లోని సూరత్ కు చెందిన దీపేశ్ షా.. డైమండ్ వ్యాపారి. అతడికి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక అతడి వార్షిక టర్నోవర్ రూ. 15 కోట్లకు పైనే. ఇంత డబ్బు, పేరు సంపాదించినా గానీ అతడికి మాత్రం మనశ్శాంతి దొరకట్లేదట. అందుకే అతడు తన భార్య పీకా షాతో కలిసి సన్యాసం తీసుకున్నాడు. వందల కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్ వదిలి ఈ దంపతులిద్దరు సన్యాసం స్వీకరించే దీక్షా కార్యక్రమానికి జాగ్వార్ కారులో వెళ్లారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? ఐదేళ్ల కిందట దీపేశ్ దంపతులు 12ఏళ్ల పెద్ద కుమారుడు ఫెరారీ కారులో వెళ్లి దీక్ష స్వీకరించడం గమనార్హం. వీరి కుమార్తె కూడా పది సంవత్సరాల క్రితమే సన్యాసంలో చేరింది.

తాజాగా తమ పిల్లల బాటలోనే నడిచారు ఆ తల్లిదండ్రులు. విలాస జీవనం వద్దు అనుకుని.. ఆధ్మాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మానసిక ప్రశాంతత దొరకట్లేదని దీపేశ్ తెలిపాడు. దీంతో ఎదో ఒకరోజు తాము కూడా సన్యాసం తీసుకుంటామని అనుకున్నట్లు ఆయన తెలిపారు. దీపేశ్ షా ఇప్పటికే సన్యాసులతో కలిసి 350 కిలోమీటర్లు ప్రయాణించగా.. ఆయన భార్య మహిళా సాధువులతో కలిసి సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించారు. కాగా.. కోట్లు ఉన్నా గానీ మనశ్శాంతి లేకుంటే జీవించలేమని చెప్పేందుకు ఈ జంటే నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి వందల కోట్ల ఆస్తిని వదిలి సన్యాసం స్వీకరించిన ఈ కుటుంబంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: డ్రైవింగ్‌ నేర్చుకోవటం అంటే ఇదా.. మనుషుల్ని చంపేస్తారా?