iDreamPost
android-app
ios-app

ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి! కొత్తరూల్ పై సర్కార్ అధ్యయనం..

  • Author Soma Sekhar Published - 02:51 PM, Tue - 1 August 23
  • Author Soma Sekhar Published - 02:51 PM, Tue - 1 August 23
ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి! కొత్తరూల్ పై సర్కార్ అధ్యయనం..

లవ్ మ్యారేజ్.. ఈ మాట వినపడగానే మన మైండ్లో కొన్ని రన్ అవుతూ ఉంటాయి. ఛేజింగ్ లు, ఫైటింగ్ లు.. చంపుకోవడాలు, నరుక్కోవడాలు. అయితే ఇవన్నీ సినిమాలో సాధ్యం అయ్యేవి. అప్పుడప్పుడు సమాజంలో కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక కొన్ని ప్రేమ జంటలు తమ ప్రేమను ఇంట్లో వాళ్లకి చెప్పి.. వారి అనుమతి తీసుకుని పెళ్లి చేసుకుంటాయి. మరికొంతమంది ప్రేమ జంటల ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు.. దాంతో పైన చెప్పిన తతంగాలు జరుగుతాయి. ఇంకొన్ని ప్రేమ జంటలు పెద్దలను ఒప్పించలేక చావే శరణ్యమంటూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో లవ్ మ్యారేజ్ లకు కూడా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలనే నిబంధనను తీసుకురాన్నది ఓ రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన సాధ్యా, అసాధ్యాలపై అధ్యయనం మెుదలు పెట్టినట్లుగా స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు.

లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఇక నుంచి తల్లిదండ్రుల పరిష్మన్ తీసుకునేలా కొత్తరూల్ ను తీసుకురానున్నది గుజరాత్ ప్రభుత్వం. ఈ కొత్తరూల్ కు సంబంధించి సాధ్యా, అసాధ్యాలపై గుజరాత్ ప్రభుత్వం అధ్యయనం మెుదలు పెట్టినట్లు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. దాంతో ఈ వార్త దేశంలో చర్చనీయాంశంగా మారింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధం అవుతోందని ఆయన ప్రకటించారు. కాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించింది. లవ్ మ్యారేజ్ లకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ.. బిల్ తీసుకొస్తే దానికి సంపూర్ణ మద్ధతు తెలుపుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాంతో ఇది మరింతగా దేశంలో చర్చనీయాంశంగా మారింది.

కాగా.. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పాటీదార్ సామాజిక వర్గం నుంచి ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో లవ్ మ్యారేజ్ లపై కొత్తరూల్ తెచ్చే ఆలోచన ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే దీనికి రాజ్యంగా పరమైన ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా? లేదా? అన్నది పరిశీలిస్తామని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చెప్పుకొచ్చారు. మరి లవ్ మ్యారేజ్ కు తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి అంటూ గుజరాత్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్తరూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఆగస్ట్‌ నెలలో 14 రోజులు బ్యాంక్‌లు బంద్‌.. లిస్ట్‌ ఇదే