iDreamPost
android-app
ios-app

దూసుకొచ్చిన మృత్యువు.. పరిగెత్తినా ​అతడి ప్రాణాలు దక్కలేదు!

ఈ నేపథ్యంలోనే బ్రిడ్జి కూలి దానికింద వెళుతున్న వాహనాలు, మనుషులపై పడింది. పలువురు చనిపోగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలోనే బ్రిడ్జి కూలి దానికింద వెళుతున్న వాహనాలు, మనుషులపై పడింది. పలువురు చనిపోగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.

దూసుకొచ్చిన మృత్యువు.. పరిగెత్తినా ​అతడి ప్రాణాలు దక్కలేదు!

ఈ మధ్య కాలంలో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, గుజరాత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలింది. దీంతో పలువురు మృత్యువాతపడటంతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో ఓ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. తాజాగా, ఈ వంతెనకు ఆరు కాంక్రీట్‌ స్లాబులు అమర్చారు. సోమవారం ఆ ఆరు కాంక్రీట్‌ స్లాబులు కూలిపోయాయి.

ఈ నేపథ్యంలోనే బ్రిడ్జి కూలి దానికింద వెళుతున్న వాహనాలు, మనుషులపై పడింది. పలువురు చనిపోగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడికి దగ్గరలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ సీసీటీవీ రికార్డు వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులోని దృశ్యాలు వీడియో చూస్తున్న వారిని కలిచి వేస్తున్నాయి. ఓ వ్యక్తి బ్రిడ్జి కూలుతున్న సమయంలో దాని కింద నడుచుకుంటూ వెళుతున్నాడు.

బ్రిడ్జి కూలటం గుర్తించిన అతడు వేగంగా పరుగులు తీయటం మొదలుపెట్టాడు. అయినప్పటికి లాభం లేకపోయింది. అతడు పక్కకు పరిగెత్తి ఉంటే ప్రాణాలు దక్కేవేమో.. బ్రిడ్జి కిందే పరుగులు తీయటంతో.. అది కూలి అతడి మీద పడింది. దీంతో శకలాల కింద పడి నలిగి చనిపోయాడు. ఆటోలు, ట్రాక్టర్లు కూడా బ్రిడ్జి కింద నలిగిపోయాయి. వాటి లోపల కూడా మనుషులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, వైరల్‌గా మారిన ఈ సీసీటీవీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş