P Krishna
Female Constable Saved Passenger: దేశంలో ట్రైన్ జర్నీ ఎంతో సురక్షితం.. సౌకర్యం అంటారు. అయితే కొంతమంది ప్రయాణికులు చేసే పొరపాట్లు,అజాగ్రత్త వల్ల ప్రాణాలో కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
Female Constable Saved Passenger: దేశంలో ట్రైన్ జర్నీ ఎంతో సురక్షితం.. సౌకర్యం అంటారు. అయితే కొంతమంది ప్రయాణికులు చేసే పొరపాట్లు,అజాగ్రత్త వల్ల ప్రాణాలో కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
P Krishna
దేశంలో సురక్షితమైన ప్రయాణాల్లో ట్రైన్ జర్నీ ఒకటి. ఈ మధ్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టాలు తప్పడం, షార్ట్ సర్క్యూట్, ఇందనంలో లోపాలు ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రయాణికులు చేసే తప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రైన్ వేగంగా బయలుదేరుతున్నా.. దాన్ని అందుకునే ప్రయత్నం చేసి పట్టాల్లో ఇరుక్కోని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. రైల్వే అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. హూంగార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా.. ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు రైల్వే పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ప్యాసింజర్లను కాపాడుతుంటారు. అలాంటి ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రైలు ప్రయాణం ఎంత సురక్షితమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా ట్రైన్ జర్నీ ఎంచుకుంటారు. సామాన్యులే కాదు సంపన్నులు కూడా రైల్వే ప్రయాణం చేయడం పై మక్కువ చూపిస్తుంటారు. కొంతమంది రైలు ఎక్కే సమయం, దిగే సమయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తరాఖాండ్ లోని రూర్కికి చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో ఓ జీఆర్పీ మహిళా కానిస్టేబుల్ రైలు నుంచి పడిపోయిన ప్రయాణికుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెంటనే అప్రమత్తమైన అతన్ని రక్షించింది. రూర్కీ లోని లక్సర్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
రూర్కీ లోని లక్సర్ స్టేషన్ లో జమ్మూ నుంచి సిల్తా వెళ్లే ట్రైన్ నాలుగో నంబర్ ఫ్లాట్ ఫై ఆగింది. రైలు ఆగడంతో ఒక ప్రయాణికుడు కిందకి దిగి తనకు కావల్సిన వస్తువులు కొని రైలు బయలుదేరుతున్నండటంతో కంగారుగా ఎక్కే ప్రయత్నం చేసి అదుపుతప్పి పట్టాల మధ్య ఇరుక్కుపోయాడు. ఆ సమయంలో ప్రయాణికుడు ట్రాక్ గోడ పట్టుకున్నాడు. అది గమనించిన జీఆర్పీ లేడీ కానిస్టేబుల్ వెంటనే అతని వద్దకు వెళ్లి స్లిప్ కాకుండా గట్టిగా పట్టుకొని అతనికి ధైర్యాన్ని నింపింది. అక్కడికి మరికొంతమంది ప్రయాణికులు చేరుకున్నారు. రైల్వేకు దీని గురించి సమాచారం అందించడంతో కొంత దూరం వెళ్లిన ట్రైన్ ఆగిపోయింది. మెల్లిగా ప్రయాణికుడిని పైకి లాగి మంచినీళ్లు ఇచ్చారు. ఈ ఘటన మొత్తం స్టేషన్ లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
लक्सर रेलवे स्टेशन पर कलकत्ता-जम्मूतवी एक्सप्रेस में रेलवे स्टेशन से खाने का सामान लेकर एक यात्री चलती ट्रेन में चढ़ने लगा। इस दौरान उसका पैर फिसल गया और वह ट्रैन और प्लेटफार्म के बीच में फंस गया। जिसे महिला आरक्षी उमा ने सुरक्षित बाहर खींचकर बचा लिया।#UttarakhandPolice pic.twitter.com/1l5dFTQ3i7
— Uttarakhand Police (@uttarakhandcops) April 28, 2024