Arjun Suravaram
LPG Cylinder Price: ప్రస్తుతం దేశంలో లోక్‌సభకు ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ జరగ్గా.. మూడో విడత పోలింగ్ త్వరలో జరగనుంది. తాజాగా సామాన్యులకు ఊరట లభించేలా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. మరి.. ఆ వివరాలు...
LPG Cylinder Price: ప్రస్తుతం దేశంలో లోక్‌సభకు ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ జరగ్గా.. మూడో విడత పోలింగ్ త్వరలో జరగనుంది. తాజాగా సామాన్యులకు ఊరట లభించేలా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. మరి.. ఆ వివరాలు...
Arjun Suravaram
నేటికాలంలో సామాన్యులకు నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన, గ్యాస్ ధరలు మధ్యతరగతి వారికి గుది బండలా మారుతున్నాయి. ఎక్కువగా వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర అయితే తనకు అడ్డు లేదన్నట్లు ఆకాశం వైపు పరుగులు తీస్తుంది. ఇక వీటి ధరల గురించి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈక్రమంలో తాజాగా సామాన్యులకు ఊరట లభించే విషయం ఒకటి వచ్చింది. ఇంకా చెప్పాలంటే గుడ్ న్యూస్. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. మరి.. ఆ తగ్గిన ధరలు ఏ కేడగిరి వారికి, ఎంత తగ్గింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం కాలం ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలోకి , వ్యాపారాల్లో ఈ గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తుంటారు. ఇవి రెండు రకాలు ఉండే సంగతి తెలిసిందేం. సామాన్యుల వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఒకలా ఉంటుంది. కమర్షియల్ ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోలా ఉంటాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షిల్ ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.19 తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. తాజాగా సవరించిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం దేశంలో లోక్‌సభకు ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ జరగ్గా.. మూడో విడత పోలింగ్ త్వరలో జరగనుంది. ఇక ఈ మూడో విడత ఎన్నికల జరిగే లోపే మే 1న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈ పెద్ద న్యూస్ వచ్చింది. దీని నుంచి సామాన్యులు, ముఖ్యంగా కమర్షియల్ వినియోగదారులకు తప్పకుండా కొంత ఉపశమనం అనే చెప్పాలి. మార్చి 9న కేంద్ర ప్రభుత్వం ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. అదే విధంగా ఏప్రిల్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి.
తాజాగా మరోసారి వాటి ధర తగ్గింది. తాజాగా ప్రస్తుతం ఉన్న ధరపై రూ.19 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని దిల్లీలో రూ.1,745.50గా ఉంది. గత ఏడాది మే నెలతో పోల్చినట్లు అయితే ఈసారి సిలిండర్ ధరలు దిగి వచ్చాయని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. గతేడాది మే నెల ప్రారంభంలో సిలిండర్ ధర ఏకంగా రూ. 172 మేర తగ్గింది. అలానే ఈ సారి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఈ తగ్గుదల కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు మాత్రమే వర్తిస్తుందని చమురు కంపెనీలు తెలిపాయి. దేశీయ సిలిండర్ ధర మాత్రం ఎలాంటి మార్పు లేదని చెప్పాయి.
దేశంలోని ప్రధానంగా ఉన్న నాలుగు మెట్రో నగరాల్లో వసురగా రెండో నెల కూడా కమర్షియల్ గ్యాస్ సిలింజడర్ రేట్లు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, అలానే చెన్నైలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.19 తగ్గించారు. అలానే కలకత్తా నగరంలో ఒక్కో గ్యాస్ సిలిండర్ పై 20 రూపాయలు తగ్గింపుతో రూ.1859 వద్ద నడుస్తోంది. ఇదే సమయంలో మహానగరం హైదరాబాద్ లో19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర 32.50 రూపాయలు తగ్గి.. రూ.1994.50కు అందుబాటులో ఉండనుంది. అయితే ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. అయితే, ఉజ్వల స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి మాత్రం సిలిండర్ కేవలం 502 రూపాయలకే లభిస్తోందని తెలుస్తోంది. వీరికి 300 రూపాయల వరకు సబ్సిడీ దొరుకుతుంది. చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ పై ధరలు తగ్గింపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.