iDreamPost
android-app
ios-app

ఉద్యోగులకు తీపి కబురు.. క్రిస్మస్ కానుక ప్రకటించిన ప్రభుత్వం!

  • Published Dec 20, 2023 | 8:57 PM Updated Updated Dec 20, 2023 | 8:57 PM

ఏదైనా పండుగలు వస్తే ఉద్యోగులకు ప్రత్యేక కానుకలు ఇస్తుంటారు. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బైకులు, కార్లు కూడా బహుమతులుగా ఇస్తున్నారు.

ఏదైనా పండుగలు వస్తే ఉద్యోగులకు ప్రత్యేక కానుకలు ఇస్తుంటారు. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బైకులు, కార్లు కూడా బహుమతులుగా ఇస్తున్నారు.

ఉద్యోగులకు తీపి కబురు.. క్రిస్మస్ కానుక ప్రకటించిన ప్రభుత్వం!

సాధారణంగా ప్రత్యేక పండుగల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రత్యేక కానుకలు అందిస్తుంటారు. కొన్ని కంపెనీలు బోనస్ లు ప్రకటిస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు బైకులు, కార్లు, గోల్డ్ కాయిన్స్ బహుమతులుగా ఇస్తుంటారు. కంపెనీ అధినేతలు ప్రకటించిన బహుమతులు చూసి ఎంప్లాయిస్ తెగ సంబరాలు చేసుకుంటారు.  ఈ నెల 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఊహించని కానుక అందించింది. ఈ వార్త తెలిసి ఎంప్లాయీస్ తెగ సంతోష పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో  క్రిస్మస్ పండుగ ఎంతో గొప్పగా జరుపుకుంటారు. క్రిస్మస్  సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ  కానుకగా రాష్ట్రంలోని 55 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ నెల వేతనాన్ని ముందుగానే వేసింది. అంతే కాదు గత కొంత కాలంగా పెండింగ్ ఉన్న డీఏ 3 శాతం పెంచుతున్నట్లు మేఘాలయా సీఎం కన్రాడ్ సంగ్మా ట్విట్టర్ వేధికగా ప్రకటించారు. ఇక పెరిగిన డీఏ 2023, జులై 1 నుంచి అమలు అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కన్రాడ్ సంగ్మా 55 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

మేఘాలయ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని.. ప్రతిపక్షాలు గతంలో విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగకు ప్రభుత్వ ఉద్యోగులను సంతోష పెట్టాలని భావించినట్లు తెలుస్తుంది. ఇక పండుగ సందర్భంగా ముందుగానే జీతం తమ అకౌంట్ లో పడటం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డీఏని క్రిస్మస్ పండుగ సందర్భంగా పెంచడం చాలా ఆనందంగా ఉందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పై ప్రభుత్వ ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.