మీరెక్కడ దొరికార్రా నాయనా..! పురీష‌నాళంలో 70 ల‌క్ష‌ల ఖ‌రీదైన గోల్డ్..!

Gold Seized: ఈజీ మనీ కోసం కొంతమంది విదేశాల నుంచి రక రకాల వస్తువులు, బంగారం, డైమండ్స్ అధికారుల కళ్లుగప్పి స్మగ్లింగ్ చేస్తున్నారు. కొన్నిసార్లు కస్టమ్స్ ఆఫీసర్లకు అడ్డంగా బుక్ అవుతున్నారు.

Gold Seized: ఈజీ మనీ కోసం కొంతమంది విదేశాల నుంచి రక రకాల వస్తువులు, బంగారం, డైమండ్స్ అధికారుల కళ్లుగప్పి స్మగ్లింగ్ చేస్తున్నారు. కొన్నిసార్లు కస్టమ్స్ ఆఫీసర్లకు అడ్డంగా బుక్ అవుతున్నారు.

తక్కువ సమయంలో ఎక్కుడ డబ్బు సంపాదించడనాకి కేటుగాళ్ళు రక రకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు. అలాంటి వాటిలో స్మగ్లింగ్ ఒకటి. విదేశాల నుంచి బంగారం, డైమండ్స్, ఖరీదైన వస్తువులు ఎయిర్ పోర్ట్ లో అధికారులకు మస్కా కొట్టి స్మగ్లింగ్ చేస్తు కోట్లు సంపాదిస్తున్నారు. పురుషుల, స్త్రీలు రక రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు.కొన్నిసార్లు దురదృష్టం కొద్ది కస్టమ్స్ అధికారుల కళ్లలో పడిపోతున్నారు.తాజాగా తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో  అధికారులు దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి నుండి రూ.70.58 లక్షల విలువైన మొత్తం 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు స్మగ్లర్ స్మగ్లింగ్ చేసిన విధానం చూసి అధికారులు షాక్ తిన్నారు.   పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి కేటుగాళ్లు రక రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని చెక్ చేయడంతో స్మగ్లర్ల గుట్టు బయటపడుతుంది. ఇటీవల కొంతమంది తమ శరీర అవయావాల్లో స్మగ్లింగ్ చేస్తు గుట్టుచప్పుడు కాకుండా బయటపడుతున్నారు. అలాంటి ఘటనే తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎయిర్ పోర్ట్ లో జరిగింది. మూడు ప్యాకెట్లలో 1081 గ్రాముల గోల్డ్ పేస్ట్‌తో కూడిన మెటీరియల్‌ను ప్రయాణికుడి పురీషనాళంలో దాచినట్లు అధికారులు తెలిపారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో దుబాయ్‌ నుంచి తిరుచ్చికి ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. సదరు వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు, ప్రస్తుతం అదనపు విచారణ కొనసాగుతోంది.

మరో ఘటనలో చెన్నై విమానాశ్రమంలో కస్టమ్స్ అధికారులు అంతర్జాతీయ టెర్మినల్ లోని అరైవల్ లాంజ్ లో బాత్రూమ్ లో 1.25 కిలోల బంగారాన్ని కనుగొన్నారు. దీని విలువ రూ. 85 లక్షలు, రెస్ట్ రూమ్ లోని చెత్త కుండిలో మూటని గమనించిన హౌస్ కీపింగ్ సిబ్బంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. మొదట అది ఏదైనా పేలుడు పదార్థం అనుకొని పార్శిల్ ని స్కాన్ చేశారు. అయితే అందులో ఉన్నది బంగారం అని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ లో ముఖాన్ని కప్పుకున్న ఓ ప్రయాణికుడు పార్శిల్ ని డస్ట్ బిన్ లో దాచినట్లు కనిపించిందని అధికారులు తెలిపారు. మార్చి నెలలో తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుంచి 410 గ్రాముల గోల్డ్ ని సీజ్ చేశారు. సదరు స్మగ్లర్ సింగపర్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ గోల్డ్ విలువ రూ. 26.62 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే తమ అవయవాళ్లో ఇలాంటి స్మగ్లింగ్ చేయడం ఈ మద్య కొత్త ఫ్యాషన్ గా మారిందని కస్టమ్స్ అధికారులు అంటున్నారు.

Show comments