Arjun Suravaram
తెలుగు రాష్ట్రాల్లో అయితే గణేషుడి నిమజ్జనం కోలాహలం ప్రారంభమైంది. పండగ మూడో రోజు నుంచి వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే నిమజ్జం వేడుకలకు పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
తెలుగు రాష్ట్రాల్లో అయితే గణేషుడి నిమజ్జనం కోలాహలం ప్రారంభమైంది. పండగ మూడో రోజు నుంచి వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే నిమజ్జం వేడుకలకు పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Arjun Suravaram
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే గణేషుడి నిమజ్జనం కోలాహలం ప్రారంభమైంది. పండగ మూడో రోజు నుంచి వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఈ గణేషుడి నిమజ్జనం కార్యక్రమం కోలాహలంగా సాగుతుంది. రేపు ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇది ఇలా ఉంటే.. కొన్ని చోట్ల వినాయకుడి నిమజ్జన కార్యక్రమాల్లో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నిమజ్జం వేడుకలకు పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే అందుకు నిదర్శనం.
గణేశుడి నిమజ్జన సమయంలో కొందరి నిర్లక్ష్యం మరికొందరికి ప్రాణసంకటంగా మారడం చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు ఒకటి చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోను చూసినట్లు అయితే.. కొందరు తమ పిల్లలతో కలిసి చిన్న గణనాథుడి విగ్రహాన్ని తీసుకుని ఓ కోనేటి దగ్గరు వెళ్లారు. ఇక అక్కడికి చేరుకున్న తరువాత వినాయకుడి విగ్రహాన్ని తమ చేతులపై తీసుకెళ్లి కోనేటిలో నిమజ్జనం చేస్తున్నారు. ఇక ముందుగా గణేశుడిని ఎత్తుకున్న వ్యక్తి మెట్ల కిందకు దిగి విగ్రహాన్ని మూడు సార్లు నీటిలో ముంచేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న పిల్లలు చిన్ని గణపతి నిమజ్జనాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. తీరా గణేశుడిని నీటిలో ముంచే సమయంలో వెనుక ఉన్న ఓ బాలిక మెల్లగా నీటి దగ్గరకు వెళ్లింది. అలా వచ్చీ రావడంతోనే మరో అడుగు ముందుకు వేసింది.
దీంతో అకస్మాత్తుగా నీటిలో మునిగిపోతుంది. బాలిక నీటిలో పడిపోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకి గురయ్యారు. ఈ దృశ్యాన్ని ఫోన్ తో వీడియో తీస్తున్న వ్యక్తి కూడా పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. అక్కడి వరకే వీడియో కనిప్సుతంది. అయితే ఆ వీడియోను చూసినట్లు అయితే నీటిలో పడిపోయిన చిన్నారి..అక్కడ ఉన్నవారు వెంటనే కాపాడినట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ చిన్నారి పరిస్థితి ఏమిటనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా దారుణం ఏమిటంటే.. పక్కనే పెద్దవారు ఉండి కూడా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కొందరు కామెంట్స్ చేశారు. వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్ లను సొంతం చేసుకుంది. మరి..ఈ వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by Jitendrasinghbouddh Buddhpriyabuddhist (@jitendrasinghbouddh)