iDreamPost

గోరింటాకు కొనడానికి వెళ్లిన కాబోయే వధువు.. ప్రియుడితో కలిసి

మరో రెండు వారాల్లో పెళ్లి. పెళ్లి కార్డులు పంచుతున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. పెళ్లి మండపానికి అడ్వాన్సులు ఇచ్చారు. గోరింటాకు కొనడానికి వెళ్లింది కాబోయే వధువు.. కానీ

మరో రెండు వారాల్లో పెళ్లి. పెళ్లి కార్డులు పంచుతున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. పెళ్లి మండపానికి అడ్వాన్సులు ఇచ్చారు. గోరింటాకు కొనడానికి వెళ్లింది కాబోయే వధువు.. కానీ

గోరింటాకు కొనడానికి వెళ్లిన కాబోయే వధువు.. ప్రియుడితో కలిసి

పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆడ పిల్లలను అపురూపంగా పెంచుకుంటారు. ఉన్నత చదువులు చదివించి, ఓ అయ్య చేతిలో పెట్టాలనుకుంటారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకుంటారు. కానీ వివాహం చేసే ముందు అమ్మాయి మనస్సును అర్థం చేసుకోలేకపోతున్నారు. కూతురి మనస్సులో ఎవరైనా ఉన్నారా లేక ఈ పెళ్లి ఆమెకు ఇష్టమా లేదా అనే ప్రశ్నలు కూడా వేయడం లేదు. పేరెంట్స్ తన లవ్ మ్యాటర్ తెలిస్తే.. ఒప్పుకుంటారా లేదా అన్న సందిగ్ధంలో కొంత మంది అమ్మాయిలు.. ప్రేమించిన వ్యక్తితో పరారౌతున్నారు. వారంలో పెళ్లి అనగానే ఓ యువతి ఇలానే చేసింది. తల్లిదండ్రులకు ఊహించని షాక్ నిచ్చింది. పోలీసుల నుండి ఊహించని కాల్ రావడంతో ఖంగుతిన్నారు అమ్మనాన్నలు.

రెండు వారాల్లో పెళ్లి. పెళ్లి కార్డులు కొట్టించారు. బంధువులకు చెప్పేశారు. పెళ్లికని మండపానికి అడ్వాన్సులు చెల్లించారు. కూతురు పెళ్లి విషయంలో ఎన్నో కలలు కంటున్నారు. అంతలో పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది. దీంతో షాక్ తిన్నారు. మరో వారంలో వివాహం అనగానే.. ప్రియుడ్ని మనువాడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. వివరాల్లోకి వెళితే.. ధర్మపురి జిల్లా కారిమంగళం అగ్రహార వీధికి చెందిన సెల్వకుమార్ చిప్ షాప్ నడుపుతున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె జ్యోతి ప్రియ ధర్మపురిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఏ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే మట్లంపట్టికి చెందిన బట్టల వ్యాపారి సెల్వకుమార్ (24) అనే యువకుడితో గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది.

అయితే జ్యోతి ప్రియ కుటుంబ సభ్యులు.. కృష్ణగిరి జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించాలని నిర్ణయించారు. మరో రెండు వారాల్లో పెళ్లి జరగనుండటంతో ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉండగా 23వ తేదీ ఉదయం జ్యోతిప్రియ గోరింట కొనుక్కోవడానికి షాపుకు వెళ్లింది. ఎంత సేపటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి సెల్వకుమార్ ఆమె స్నేహితుల ఇళ్లు, బంధువుల ఇళ్లు ఇలా పలు ప్రాంతాల్లో వెతికారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జ్యోతి ప్రియ.. ప్రియుడ్ని పెళ్లి చేసుకుని అదే పోలీస్టేషన్‌ను ఆశ్రయించింది. తనకు తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, ప్రియుడ్ని పెళ్లి చేసుకున్నానని, తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. ఆ తర్వాత ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు మాట్లాడి.. ఇంటికి పంపారు. వరుడి కుటుంబీకులు యువతి కుటుంబీకులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి