iDreamPost
android-app
ios-app

భక్తుడి అత్యుత్సాహం..వివాదంలో చిక్కుకున్న కొప్పల్ గవి సిద్దేశ్వర స్వామిజీ!

Abhinava Gavisiddeshwara Swamiji: ప్రముఖ మఠమైన గవి సిద్ధేశ్వర మఠ స్వామిజీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నుంచి ఆశీర్వాదం తీసుకునే విషయంలో భక్తులు చూపించిన అత్యుత్సాహం ఆయనను వివాదంలో నెట్టింది.

Abhinava Gavisiddeshwara Swamiji: ప్రముఖ మఠమైన గవి సిద్ధేశ్వర మఠ స్వామిజీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నుంచి ఆశీర్వాదం తీసుకునే విషయంలో భక్తులు చూపించిన అత్యుత్సాహం ఆయనను వివాదంలో నెట్టింది.

భక్తుడి అత్యుత్సాహం..వివాదంలో చిక్కుకున్న కొప్పల్ గవి సిద్దేశ్వర స్వామిజీ!

ఉన్నత స్థితిలో, ప్రముఖమైన స్థానంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైన విషయంలో ఆచితూచి ప్రవర్తించాలి. ఏమాత్రం ఏమారపాటుగా ఉన్న వివాదాల్లో ఇరుకుంటారు. కొన్ని సార్లు వారి ప్రమేయం లేకున్నా కూడా వివాదాల్లో చిక్కుకుంటారు. ఇలా ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పీఠాధిపతులు కూడా చిక్కుల్లో పడతారు. తాజాగా భక్తులు చూపిన అత్యుత్సాహం.. గవి సిద్దేశ్వర స్వామిజీని వివాదాల్లోకి నెట్టింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్నాటకలో రాష్ట్రంలో ఉన్న కొప్పల్ గవి సిద్దేశ్వర మఠం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరుగాంచింది. ఇక్కడికి కర్నాటకతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ గవి సిద్దేశ్వర స్వామిజీ పీఠాధిపతిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో భక్తులు చూపిన అత్యుత్సాహం ఆయనను వివాదంలోకి నెట్టింది. ఇటీవలే భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే సమయంలో ఓ భక్తుడు స్వామిజీ కాళ్లను  తన కళ్లకు, తలకు తగిలించుకున్నాడు.

ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలువు నెటిజన్లు ఈ ఇష్యూపై నెగిటీవ్ కామెంట్స్ చేశారు. పిల్లలతో, వృద్ధులతో స్వామిజీ ఇలా చేయించడం సరైన విధానామా? అంటూ కొందరు ప్రశ్నించారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ ఫోటోతో గవిసిద్దేశ్వర స్వామిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ  సంఘటను సమర్థిస్తున్నారు. స్వామి వారి సేవలో ఇలాంటివి మాములే అంటూ గవి సిద్దేశ్వర స్వామిజీ భక్తులు చెబుతున్నారు. మొత్తానికి ఓ ఆశీర్వాదం అభినవ గవి సిద్ధేశ్వర స్వామిజీని వివాదంలోకి లాగింది.

ఇక ఈ సిద్దేశ్వర మఠం గురించి చూసినట్లు అయితే.. లింగాయత్ సంప్రదాయకంలో ఏర్పడిన మఠం ఇది.  ఉత్తర కర్నాటక జిల్లాలోని కొప్పల్ లో ఈ గవి సిద్దేశ్వర మఠం ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత పురాతన మఠాల్లో  ఇది ఒకటి. ఈ  మఠంకి ఎంతో  ప్రత్యేక స్థానం ఉంది. 800 ఏళ్ల క్రితం ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు అయ్యింది.  బసవేశ్వరుడి స్పూర్తితో రూపు దాల్చింది. ప్రస్తుతం పీఠాధిపతిగా గవి సిద్ధేశ్వర మహా స్వామి ఉన్నారు. ఈ మఠం ఆధ్వర్యంలో పేదలకు విద్యా,వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. నిత్యం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ గవి సిద్దేశ్వరానికి భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. గతంలో ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మఠాన్ని సందర్శించారు. ప్రస్తుతం తాజాగా వివాదంతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.