Arjun Suravaram
Youngest MPs: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వాతావరణ సందడి నిన్నటితో ముగిసింది. మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయో కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది. తాజాగా ఈ ఎన్నికల్లలో 25 ఏళ్ల వయస్సున్న నలుగురు యువత ఎంపీలుగా ఎన్నికయ్యారు.
Youngest MPs: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వాతావరణ సందడి నిన్నటితో ముగిసింది. మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయో కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది. తాజాగా ఈ ఎన్నికల్లలో 25 ఏళ్ల వయస్సున్న నలుగురు యువత ఎంపీలుగా ఎన్నికయ్యారు.
Arjun Suravaram
మంగళవారం భారత దేశ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టనుంది. అయితే గత ఎన్నికల్లో చూపించిన ప్రభావం ఈ సారి బీజేపీ చూపించలేకపోయింది. ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడమే కాకుండా సొంతంగా మెజార్టీ కూడా పొందలేదు. అయితే ఎన్డీఏ కూటమిగా 292 స్థానాలను పొందంది. ఇదే సమయంలో ఇండియా కూటమి కూడా భారీగా పుంజుకుంది. ఇవి ఇలా ఉంటే.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు యువత ఎంపీలుగా ఎన్నికయ్యారు. కేవలం 25 ఏళ్లు లోపు ఉన్న వాళ్లు లోక్ సభలోకి అడుగుపెట్టనున్నారు. మరి.. ఆ యువ ఎంపీలు ఎవరు, వారి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వాతావరణ సందడి నిన్నటితో ముగిసింది. మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయో కూటమి హ్యాట్రిక్ విజయం సాధించగా, ఇండియా కూటమి విజయానికి చేరువగా వచ్చి ఆగింది. ఎన్డీయో కూటమికి 293 సీట్లు రాగా, ఇండియా కూటమికి 234 వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 272 స్థానాలు కావాల్సి ఉండగా, ఎన్డీయే కూటమికి మ్యాజిక్ ఫిగర్ కంటే అదనంగా కేవలం 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. చార్ సౌ బార్ అని ఎన్డీయో ఇచ్చిన నినాదం కలగానే మిగిలింది. ఇది ఇలా ఉంటే.. ఈ సారి ఎన్నికల్లో కొత్తవారు అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. అయితే వారిలో కూడా కొందరు 25 ఏళ్ల వయస్సు ఉన్న ఎంపీలు ఉన్నారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు యువ ఎంపీలుగా ఎన్నికయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ అనే ఇద్దరు యువతులు గెలుపొందారు. వారి వయస్సు కేవలం 25 ఏళ్ల మాత్రమే. అలానే లోక్ జనశక్తి పార్టీ నుంచి శాంభవి చౌదరీ, కాంగ్రెస్ నుంచి సంజన జాతవ్ అనే యువతులు విజయం నమోదు చేశారు. వీరిలో శాంభవి చౌదరీ బీహార్ రాష్ట్రం నుంచి విజయం సాధించారు. నితీశ్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న అశోక్ చౌదరీ కుమార్తె శాంభవి చౌదరీ. ఈమె సమస్తిపుర్ నియోజవర్గం నుంచి విక్టరీ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై ఆమె విజయం సాధించారు. ఎన్డీఏ ఎన్నికల ప్రచారం టైమ్ లో శాంభవి యువ అభ్యర్థి అని ప్రధాని మోదీ కొనియాడారు.
అదే విధంగా సంజనా జాదవ్ అనే 25 ఏళ్లయువతి రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పుర్ నియోజవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోహ్లీపై 51 వేల పై చిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఈమె కప్తాన్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను పెళ్లి చేసుకున్నారు.పుష్పేంద్ర సరోజ్ కౌషాంబి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి.. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ పై లక్ష మెజారిటీతో పుష్పేంద్ర విజయం సాధించారు. మచ్చిలిషార్ లోక్ సభ నియోజవర్గం నుంచి ప్రియా సరోజ్ 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ ఎంపీ బోలానాథ్‌పై ఆమె గెలుపొందారు. మొత్తంగా ఈ సారి నలుగురు 25 ఏళ్ల నలుగురు యువ ఎంపీలు పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు.