Krishna Kowshik
తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా, మిజోరాం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4 న ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఓ మహిళ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా, మిజోరాం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4 న ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఓ మహిళ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Krishna Kowshik
పోతులూరి వీర బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ‘తెర మీద బొమ్మలే పరిపాలనలోకి వచ్చి అధికారం చెలాయించేను’ అని చెప్పినట్లే ఉన్నాయి దేశంలోని పరిస్థితులు. నటీ నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి..ప్రజలను పాలిస్తున్నారు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ సినిమా రంగానికి చెందిన వారే. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి సీఎంలు అయ్యారు. కొంత మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాణించారు. ఈ క్రమంలో మిజోరాం రాష్ట్రానికి చెందిన ఓ మహిళా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇటీవల మిజోరాంతో సహా తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. కాగా మిజోరాం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4 న ప్రకటించారు. ఆ రాష్ట్రంలో జోరామ్ పీపుల్స్ మూమెంట్( ZPM) ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
కాగా, గెలుపొందిన వారిలో ‘బారిల్ వన్నెహ్‌సాంగి’ అనే మహిళా అందరిలో ప్రత్యేకంగా నిలిచింది. అయితే ఆమె ఎందుకు అంత ప్రత్యేకత సంపాదించుకుంది? అందంగా ఓ మోడల్ లా కనిపించే ఈమె కథ ఏమై ఉంటుంది? వీటి గురించి తెల్సుకుందాం.. మిజోరాం లోని మొత్తం 40 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. కాగా డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడించారు. ఈ క్రమంలో ZPM పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి అడుగుపెట్టింది. మిజోరాంలో తొలిసారిగా ముగ్గురు మహిళలు ఎమ్మెల్యే లుగా ఎంపికయ్యారు. వారిలో ఒకరు బారిల్, ఐజ్వాల్ సౌత్-3 నుంచి బారిల్ ZPM తరుపున గెలుపొందారు. ఈమె వయస్సు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే.
మిజోరాంలో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే గా రికార్డు సృష్టించింది. అసలు ఏమిటి ఈమె ప్రత్యేకత అంటే.. ఆమె ఓ సెలబ్రిటీ కావడమే. ఈమె షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకుంది. బారిల్ మొదట యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించారట. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా ఫేమస్ అయింది. క్రమంగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఉన్న క్రేజ్ తో పాటు ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బారిల్ అందరికి ప్రత్యేకంగా నిలిచింది. మిజోరాం ఎన్నికల ఫలితాల తర్వాత బారిల్ లింగ సమానత్వం గురించి గట్టిగా మాట్లాడారు. ‘మహిళలు తమకు నచ్చింది, తమ అభిరుచికి తగినట్టుగా .. వారు దేనినైతే చేపట్టాలి అనుకుంటున్నారో దానికోసం మాత్రమే ముందుకుసాగాలి‘ అని బారిల్ తెలిపారు.
కాగా గతంలో ఆమె ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా కూడా పని చేశారు. ఇక ఈ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూమెంట్(ZPM) ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. కాగా, మిజోరాం ఎన్నికల్లో పోటీ చేసిన 174 మంది అభ్యర్థుల్లో 16 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంతో.. మొత్తం 18 స్థానాల్లో మహిళా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డారు. వారిలో తొలిసారి ముగ్గురు మహిళలు గెలుపొందడం విశేషం. ఏదేమైనా, ఒక సాధారణ టీవీ యాంకర్ నుంచి ప్రజలచేత ఎన్నుకోబడ్డ అత్యంత పిన్న వయస్కురాలైన నాయకురాలిగా.. బారిల్ అందరికి ఆదర్శంగా నిలిచింది. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.