Dharani
ఆగస్టు 23, బుధవారం సాయంత్రం 5:45 గంటల తర్వాత చంద్రునిపై ల్యాండ్ కానుంది. మిగతా దేశాలకు భిన్నంగా భారతదేశ మూన్ మిషన్.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వబోతుంది.
ఆగస్టు 23, బుధవారం సాయంత్రం 5:45 గంటల తర్వాత చంద్రునిపై ల్యాండ్ కానుంది. మిగతా దేశాలకు భిన్నంగా భారతదేశ మూన్ మిషన్.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వబోతుంది.
Dharani
132 కోట్ల మంది భారతీయలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఆ అద్భుతం మరి కొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-3 మరి కొన్ని గంటల్లో జాబిల్లిని ముద్దాడనుంది. ఆగస్టు 23, బుధవారం సాయంత్రం 5:45 గంటల తర్వాత చంద్రునిపై ల్యాండ్ కానుంది. మిగతా దేశాలకు భిన్నంగా భారతదేశ మూన్ మిషన్.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వబోతుంది. చంద్రయాన్-3 అంతరిక్షంలో గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇక మరి కొన్ని గంటల్లో ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మిషన్ విజయం సాధించడం కోసం ఇస్రో కొత్త ప్రణాళికను అమలు చేయనుంది. ఆ వివరాలు..
ఇస్రో కొత్త ప్రణాళిక అమలు చేయడానికి ప్రధాన కారణం.. రష్యా మూన్ మిషన్ విఫలమవ్వడం. దీనిలో భాగంగా ఇస్రో చంద్రయాన్ -3 క్రాఫ్ట్‌ను తాబేలు కంటే తక్కువ వేగంతో నడపాలని నిర్ణయించింది. తాబేళ్లు సెకనుకు సగటున 4 నుండి 5 సార్లు ఈదుతాయి. దాంతో అవి సెకనుకు 1 నుండి 2 మీటర్ల వేగం మాత్రమే కదులుతాయి. దీని ప్రకారం చూసుకుంటూ తాబేళ్లు 30 గంటల్లో 40 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే చేరుకుంటాయి.
ఇక ఆడ తాబేలు.. తన చిన్న లేదా మగ తాబేళు కన్నా వేగంగా కదులుతుంది. వేటాడే జంతువుల నుంచి తమ పిల్లలను కాపాడుకోవడం కోసం తాబేళ్లు ఇలా చేస్తాయి. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియలో కూడా ఇస్రో ఇదే విధానాన్ని అనుసరించనుంది. అంటే చంద్రయాన్-3 సెకనుకు 1 నుంచి 2 మీటర్ల వేగంతో ల్యాండ్ అవుతుంది.
రష్యాకు చెందిన లూనా-25 అంతరిక్ష నౌక కుందేలులా వేగంగా పరిగెత్తింది. జాబిల్లిని చేరుకునేలోపే.. లూనా-25 క్రాఫ్ట్ క్రాష్ అయ్యింది. రష్యా అంతరిక్ష సంస్థ అధిపతి కూడా ఈ తప్పును అంగీకరించారు. లూనా-25 నిర్దేశించిన లక్ష్యం కంటే.. ఒకటిన్నర రెట్లు ఎక్కువ వేగంతో కదిలింది. స్థిర కక్ష్యతో పోలిస్తే ఓవర్‌షూట్. అందుకే లూనా-25 క్రాఫ్ట్‌ను చంద్రుడిని తాకి క్రాష్ అయ్యినట్లు రష్యా అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మాత్రం నెమ్మదిగా 42 రోజుల నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ ప్రయాణం చంద్రయాన్-3 గురుత్వాకర్షణ శక్తిని చాలా బాగా సద్వినియోగం చేసుకుంటుందన్నారు శాస్త్రవేత్తలు.