iDreamPost
android-app
ios-app

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవులు!

Bank Holidays: ప్రతి ఒక్కరి బ్యాంకుల్లో పని ఉంటుంది. ఈ క్రమంలోనే ఏ రోజు బ్యాంకుకి సెలవు అనే విషయాలను తెలుసుకునేందుకు ఆస్తకి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ బ్యాంకుల సెలవుల గురించి కీలక విషయాలను వెల్లడించింది.

Bank Holidays: ప్రతి ఒక్కరి బ్యాంకుల్లో పని ఉంటుంది. ఈ క్రమంలోనే ఏ రోజు బ్యాంకుకి సెలవు అనే విషయాలను తెలుసుకునేందుకు ఆస్తకి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ బ్యాంకుల సెలవుల గురించి కీలక విషయాలను వెల్లడించింది.

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవులు!

నేటికాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో ఏదో ఒక పని ఉంటుంది. ఇక బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు అనేక సౌకర్యాలను కల్పిస్తుంటాయి. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. అందుకే నిత్యం బ్యాంకులకు సంబంధించిన వార్తలు తెలుసుకునేందుకు జనం ఆస్తకి చూపిస్తుంటారు. ఇదే సమయంలో బ్యాంకులకు వెళ్లే వారు.. వాటి సమాచారం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సెలవు దినాల్లో వెళ్తే.. మీ సమయం వృథా అవుతోంది.  ఈ క్రమంలోనే తాజాగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుకు సంబంధించి మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మంగళవారం వరకు ఆగాల్సిందే.

సంక్రాంతి పండుగ, ఇతర కారణాల నేపథ్యంలో బ్యాంకులకి ఐదు రోజులలు సెలవులు ఉన్నాయి. ఈ హాలీడేస్ కూడా వివిధ రాష్ట్రాలు, ప్రదేశాలను బట్టి మారుతూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఏయే రోజు సెలవు ఉందో వెల్లడించింది. అన్ని బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. అన్ని బ్యాంకులకి నియంత్రణ సంస్థగా ఆర్బీఐ వ్యవహరిస్తుంది. అందుకే, బ్యాంకులకు సెలవుల విషయం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిర్ణయిస్తుంది. బ్యాంకులకు ఏ రోజు సెలవు ఇవ్వాలో, ఏ రోజు సెలవు ఇవ్వకూడదో ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, బ్యాంకులకు రెండవ, నాల్గవ శనివారాల్లో సెలవు ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అది కూడా అతి త్వరలో అన్ని శనివారాల్లో చేయాలని ప్రతిపాదించింది.

alert for bank coustmers 5 days holidays for banks

తాజాగా ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ను పరిశీలిస్తే.. జనవరిలో బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు ఉన్నాయి. జనవరి 11వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దాని జాబితా ఈ విధంగా ఉంది. జనవరి 11న అగల్ సర్కిల్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ రోజున మిజోరం రాష్ట్రంలో మిషనరీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదే విధంగా కోల్‌కతా పరిధిలో బ్యాంకులు జనవరి 12న మూసి ఉంటాయి. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజు జరుపుకుంటారు. ఆయన పుట్టిన రోజును దేశం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

అదే విధంగా జనవరి 13, 14 తేదీల్లో బ్యాంకులకు శని, ఆదివారాలు హాలిడేస్ ఉంటాయి. జనవరి 13న రెండవ శనివారం. ఇక జనవరి 15న దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈ పండగను అందరూ జరుపుకుంటారు. ముఖ్యంగా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, గౌహతి ప్రాంతాల్లో జనవరి 15న బ్యాంకులు మూసివేస్తారు. ఈ ప్రదేశాలలో పొంగల్, మాగ్ బిహు పండుగలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఏ ప్రాంతంలోను బ్యాంకుకి వరుసగా ఐదు రోజులు సెలవు లేవని గమనించాలని బ్యాంకింగ్ నిపుణలు సూచిస్తున్నారు. మీ బ్యాంకులు ఏ పరిధిలో ఉన్నాయో.. వాటి సెలవులు సమాచారం తెలుసుకుని అక్కడి వెళ్తే.. సమయం ఆదా అవుతోందిని నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. బ్యాంకులకు సంబంధించిన ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet