Keerthi
మహా నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి వాహనదారులకు గట్టేక్కించడానికి అదనంగా ఫ్రైఓవర్ లు కూడా నిర్మిస్తున్నారు. అయిన సరే వాహనదారులకు ఈ కష్టాలు అనేవి వెంటాడుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరటనిస్తూ.. తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫైఓవర్లు నిర్మాణం బెంగళూరులో ప్రారంభమైంది.
మహా నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి వాహనదారులకు గట్టేక్కించడానికి అదనంగా ఫ్రైఓవర్ లు కూడా నిర్మిస్తున్నారు. అయిన సరే వాహనదారులకు ఈ కష్టాలు అనేవి వెంటాడుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరటనిస్తూ.. తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫైఓవర్లు నిర్మాణం బెంగళూరులో ప్రారంభమైంది.
Keerthi
వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలనేవి ఎప్పుడు వెంటాడుతునే ఉంటాయి. ముఖ్యంగా మహా నగరాల్లో అయితే ఈ ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికీ తీరనివి. అడగడుగునా రద్దీ అయినా ట్రాఫిక్ లతో ఆఫీసులకు, స్కూల్లకు, కాలేజీలకు వెళ్లవలసిన ఉద్యోగులు, విద్యార్థులు విసుగు చెందుతుంటారు. ఈ క్రమంలోనే ఈ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొంటూ అధికారులు అదనంగా ఫ్లై ఓవర్లు నిర్మిస్తూ కొంత ట్రాఫిక్ రద్దీని నియంత్ర ఇస్తున్నప్పటికి ఇంక వాహనాదారులకు ఈ సమస్యలు అనేవి నీడలా వెంటాడుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. వాహనదారులకు ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి ఊరట కలిగించడానికి తొలిసారిగా దక్షిణ భారత దేశంలో డబుల్ డెక్కర్ ఫైఓవర్లు నిర్మాణ కొనసాగుతుంది. అయితే ఈ వార్త నిజంగా వాహనదారులకు ఓ శుభవార్త అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ డబుల్ డెక్కర్ ఫ్రైఓవర్ కు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకి ఎక్కడంటే..
మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి వాహనదారులకు ఊరట అందించేందుకు తాజాగా కర్ణటాక ప్రభుత్వం ముందడగు వేసింది. ఈ క్రమంలోనే.. తొలిసారిగా దక్షిణాది డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ తాజాగా బెంగళూరు నగరంలో ప్రారంభమైంది. అయితే ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను రాగిగూడ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డు జంక్షన్ వరకు మొత్తం 3.3 కిలోమీటర్ల పొడవుతో వంతెనను నిర్మించారు. కాగా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక ఉప-ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆ రాష్ట్ర రవాణా మంత్రి రామలింగారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎగువ డెక్‌లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ దిగువ డెక్‌లో వాహనాల రాకపోకలకు రహదారిగా నిర్మించారు. అయితే బెంగళూరులో మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కారణంగా ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం ఆలస్యమైందట. ఇక ప్రస్తుతం ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే, ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆఫ్కాన్స్ సంస్థ ఈ వంతెన నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇకపోతే రాగిగూడ నుంచి వచ్చే వాహనదారులు.. ర్యాంప్ ఏ నుంచి, అలాగే, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ నుంచి వచ్చే వాహనాలు ర్యాంప్ సి ఫ్లైఓవర్ మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్రౌండ్ లెవల్‌లో ఉన్న ర్యాంప్ B.. ర్యాంప్ ఏ నుంచి ఔటర్ రింగ్ రోడ్, మైసూర్ రోడ్డులను కలుపుతుంది. ఇక హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ నుంచి వచ్చే వారు ర్యాంప్ డి, మెట్రో ఎల్లో లైన్ నుంచి బీటీఎం లేఅవుట్‌కు వెళ్లాలంటే ర్యాంప్ ఈ ద్వారా చేరుకోవాలి. అయితే ర్యాంప్ ఏ, బీలు రెండూ అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారి (NH-44) మీదుగా ఇప్పటికే ఉన్న మడివాలా ఫ్లైఓవర్‌ను కలుపుతాయి. అందుకోసం ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ తొలి దశలో ర్యాంప్-ఏ, బి,సీ ర్యాంపుల నిర్మాణం మే 2024 నాటికి పూర్తిచేయగా.. మిగతా రెండూ ఈ ఏడాది డిసెంబరు చివరికి పూర్తవుతాయని బీఎంఆర్సీఎల్ తెలిపింది.
ఇకపోతే దక్షిణాది రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కావడం గమన్హారం. దీంతో వాహనదారులకు ఇకపై ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. వర్షాలు కురిసినప్పుడు రోడ్లు అన్నీ రద్దీగా గంటల సమయం ట్రాఫిక్ నిలిచిపోతుంది. కానీ, ఇప్పడు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాల నుంచి బెంగళూరు వాసులకు కొంత మేర ఉపశమనం కలగనుంది. ఇదిలా ఉంటే.. త్వరలో హైదరాబాద్ నగరంలో కూడా ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల జాతీయ రహదారుల సంస్థతో కలిసి.. హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా.. మదీనాగూడ వద్ద 1.2 కి.మీ. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసినట్టు పేర్కొంది. మరి, బెంగళూరు నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ అందుబాటులోకి వస్తున్న ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bengaluru city’s 1st Double Decker flyover between Silk Board & Ragigudda will be opened for public use at 3pm tomorrow finally by Hon DCM @DKShivakumar & Hon Transport minister @RLR_BTM on a trial basis
pic.twitter.com/z8Yt8DtlQz— Karnataka Weather (@Bnglrweatherman) July 16, 2024