nagidream
Fire Storm On Sun: భగభగ మండే సూర్యుడిపై అగ్ని తూఫాన్ కి సంబంధించి ఆదిత్య ఎల్1 ఫోటోలు తీసింది.
Fire Storm On Sun: భగభగ మండే సూర్యుడిపై అగ్ని తూఫాన్ కి సంబంధించి ఆదిత్య ఎల్1 ఫోటోలు తీసింది.
nagidream
భారతదేశం అన్ని రంగాల్లో ముందు ఉంది, స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఉన్న పురోగతి ఒక ఎత్తు అయితే కేవలం దశాబ్ద కాలంగా భారత్ ప్రపంచ పటంలో వేస్తున్న అడుగులు మరో ఎత్తు. భారతదేశాన్ని మనం చేసే కొన్ని ప్రయోగాలు ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో నించో పెడుతున్నాయి. ఇప్పటికే అంతరిక్ష పరిశోధనకి సంబంధించి ప్రపంచంలో అన్ని దేశాల్లోకెల్లా ఎక్కువ సక్సెస్ రేట్ అలానే తక్కువ ఖర్చుతో క్వాలిటీ శాటిలైట్లను పంపుతున్నాము. ఆ ప్రయోగాల్లో ఒకటే సూర్యుడిని అధ్యయనం చెయ్యడం.
ISRO నుండి ఆదిత్య-L1 అంతరిక్ష నౌకను సూర్యుడిని అధ్యయనం చేయడానికి పంపింది. ఈ అంతరిక్ష నౌకపై ఉన్న రెండు రిమోట్ సెన్సింగ్ పరికరాలు సూర్యుడుపై జరిగే ఆక్టివిటీస్ ను ఫోటోలు తీసాయి. ISRO ఈ సమాచారాన్ని తమ X అకౌంట్‌లో సూర్యుడి ఫోటోలను విడుదల చేసింది. ఆదిత్య L1 ఈ సంవత్సరం జనవరి 6న లాగ్రాంగియన్ పాయింట్‌కి చేరుకుంది. ప్రస్తుతం, ఆదిత్య L1 భూమికి సుమారు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిని అధ్యయనం చేస్తుంది.
ఆదిత్య-L1 పై ఉన్న సౌర అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) అలాగే విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (VELC) సూర్యునిపై ఘటనలను పరిశీలించాయి. ISRO ప్రకటన ప్రకారం, ఈ చిత్రాలు మే నెలలో తీసినవని తెలియజేసింది. వారు X-క్లాస్ మరియు M-క్లాస్ ఫ్లేర్స్‌ను, కొరోనల్ మాస్ ఈజెక్షన్లతో రికార్డు చేశారు. మే 8 నుండి 15 వరకు సూర్యునిపై క్రియాశీలంగా ఉన్న AR 13664 అనే సక్రియ ప్రాంతం X-క్లాస్ మరియు M-క్లాస్ ఫ్లేర్స్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఫ్లేర్స్ మే 11న గమనించిన జియోమాగ్నటిక్ తుఫానుకు కారణమయ్యాయి.
ఇలా సూర్యుడిని గమనించి అక్కడ జరిగే మార్పులని బట్టి ఎలా మన భూమిని మనం కాపాడుకోవాలనే దిశగా జరుగుతున్న ఈ పరిశోధనలు ఎప్పటికీ పూర్తి అవుతాయి అనేది తెలియదు కాని, ముందు ముందు రాబోయే దారుణమైన రోజులకి ఈ ప్రయోగాలు వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో వేచి చూడాలి.