Krishna Kowshik
నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పుతున్నారు.
నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పుతున్నారు.
Krishna Kowshik
ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో శనివారం ఉదయం ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంగుల్ జిల్లాలో ఉన్న ఎన్టీపీసీకి చెందిన కనిహా ప్లాంట్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. తాల్చేర్ ప్రాంతంలోని ప్లాంట్‌లోని బొగ్గు రవాణా కన్వేయర్ బెల్ట్‌లో ఉదయంం 8.10 గంటలకు మంటలు చెలరేగగా.. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందింది. అప్పటికే మంటలు చెలరేగాయి. ప్లాంట్ మొత్తం అగ్ని కీలలు అలముకున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.. మంటలను అదుపులోకిి తీసుకు వచ్చారు.
మంటలను పూర్తిగా ఆర్పివేశామని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సమయంలో CISF సిబ్బందికి ఒకరికి చిన్నపాటి దెబ్బతగిలిందని, ప్రాథమిక చికిత్స అందించినట్లు ఎన్టీపీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది మినహా ఏ వ్యక్తికి ఎటువంటి గాయాలు జరగలేదని పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 500 MW యూనిట్-3ని కొద్దిసేపు మూసివేసినట్లు తెలిపింది. అగ్ని ప్రమాదానికి కారణాలను తెలియరాలేదని, అలాగే ఈ ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, త్వరలోనే మరమ్మత్తు పనులు చేస్తామని తెలిపింది. అగ్ని ప్రమాదంలో కన్వేయర్ బెల్ట్ లోని కొంత భాగం దెబ్బతిన్నట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు.
తరచుగా ప్లాంట్లలో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయి. కొన్ని సార్లు మానవ తప్పిదం, నిర్లక్ష్యంగా కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ప్రాణ నష్టంతో పాటు కోట్లల్లో ఆస్తి నష్టం కలుగుతూ ఉంటుంది. ప్రాణ నష్టం కారణంగా కుటుంబ పెద్దను కోల్పోయి.. కుటుంబాలు రోడ్డున పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. కాగా, అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.