Tirupathi Rao
Miss India Nikita Porwal Biography: ఫెమినా మిస్ ఇండియా పోటీలు ఘనంగా ముగిశాయి. మధ్యప్రదేశ్ భామను ఈసారి మిస్ ఇండియా కిరీటం వరించింది. నిఖిత పోర్వాల్ మిస్ ఇండియా 2024గా అవతరించింది. మరి ఈ సందర్భంగా.. ఈ అమ్మడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
Miss India Nikita Porwal Biography: ఫెమినా మిస్ ఇండియా పోటీలు ఘనంగా ముగిశాయి. మధ్యప్రదేశ్ భామను ఈసారి మిస్ ఇండియా కిరీటం వరించింది. నిఖిత పోర్వాల్ మిస్ ఇండియా 2024గా అవతరించింది. మరి ఈ సందర్భంగా.. ఈ అమ్మడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
Tirupathi Rao
60వ ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన భామలు పాల్గొన్నారు. ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటం మధ్యప్రదేశ్ భామను వరించింది. ఫెమినా మిస్ ఇండియా 2024గా నిఖిత పోర్వాల్ విజయం సాధించింది. మిస్ మధ్యప్రదేశ్ నుంచి మిస్ ఇండియాగా గెలిచింది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల్లో నిఖిత భారత్ తరఫున ప్రాతనిధ్యం వహించనుంది. ఈమె కేవలం అందగత్తె మాత్రమే కాదు.. మంచి స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ నిఖితా పోర్వాల్ అంటూ నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అందుకే మీకోసం నిఖితకు చెందిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియో రూపంలో తీసుకొచ్చాం.
మిస్ ఇండియా పోటీల్లో ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ తన సత్తా చాటింది. ఎన్నో కష్టమైన, క్లిష్టమైన రౌండ్స్ ని దాటుకుని చివరకు మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. నిఖిత తర్వాత మొదటి రన్నరప్ గా రేఖా పాండే నిలిచింది. రెండో రన్నరప్ గా ఆయుశీ దోలకియా నిలిచింది. వీళ్లు కేవలం అందంతోనే కాదు.. తమ టాలెంట్ తో కూడా న్యాయ నిర్ణేతలను మెప్పించారు. 30 మందితో తలపడి నిఖిత ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా నిఖిత తన ఆనందాన్ని పంచుకుంది. ఇప్పటికీ తాను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ముందుగా తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పింది. వారి కళ్లల్లో ఆనందం చూస్తే తనకు గర్వంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ ఆనందాన్ని తాను మాటల్లో వర్ణించలేను అంటూ కామెంట్స్ చేసింది. తన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందని.. ఇంకా సాధించాల్సినవి చాలానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది.
ఉజ్జయినికి చెందిన నిఖిత గురించి చాలానే ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. నిఖిత పోర్వాల్ కాన్వెంట్ చదువు కార్మెల్ కన్వర్ట్ సెంకడరీలో సాగించింది. ఆ తర్వాత ఉన్నత చదువు కోసం గుజరాత్ కు వెళ్లింది. మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. చదువును బ్యాలెన్స్ చేస్తూనే.. మోడలింగ్ మీద దృష్టి పెట్టింది. చాలామంది ఒకవైపు దృష్టి మళ్లితే చదువును పట్టించుకోరు. కానీ, నిఖిత రెండింటిన బ్యాలెన్స్ చేస్తోంది. ఈమెకు చదువు, అందాల పోటీలు మాత్రమే కాదు.. యాక్టింగ్ అంటే కూడా ఇష్టం. ఆమెకు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టమట. అందుకే 18వ ఏటే రంగస్థల ప్రవేశం చేసింది. అప్పటి నుంచి ఆమె స్టేజ్ షోలు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు 60కి పైగా నాటకాలు వేసింది.
ఆమెకు స్టేజ్ పర్ఫార్మెన్సే ఫస్ట్ లవ్ అంటూ చెప్పుకొచ్చింది. మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఈ భామ త్వరలోనే వెండితెర మీద కూడా మెరవనుందని సమాచారం. ఈ అమ్మడుకి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని బీ టౌన్ లో టాక్ నడుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ ఓ మూవీలో ఛాన్స్ ఇచ్చారట. అయితే హీరోయిన్ గానా.. స్పెషల్ అప్పియరెన్సా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిఖిత ఇంకో టాలెంట్ కూడా ఉంది. ఈమె రచయిత్రి కూడా. కృష్ణలీల అనే పుస్తకాన్ని రాసింది. ఇంక జంతువులు అంటే ప్రాణం. మూగజీవాల సంరక్షణ కోసం NGOలతో కలిసి పనిచేస్తోంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తోంది. జంతు వధను వ్యతిరేకిస్తూ క్యాంపైన్స్ చేస్తూ ఉంటుంది. ఇంక ఈ అమ్మడుకి ఇంకో ఇష్టం కూడా ఉంది. అదేంటంటే.. తీర్థయాత్రలు అంటే ఇష్టమట. కుటుంబంతో తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటుంది. మరి.. కొత్త మిస్ ఇండియా నిఖిత పోర్వాల్ కి మీ శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.