Arjun Suravaram
FASTag New Rule: ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఫాస్టాగ్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసింది. ఇటీవలే దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శాకలను జారీ చేసింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఫాస్టాగ్ సర్వీస్ పై ఓ కొత్త రూల్ అమల్లోకి రానుంది.
FASTag New Rule: ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఫాస్టాగ్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసింది. ఇటీవలే దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శాకలను జారీ చేసింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఫాస్టాగ్ సర్వీస్ పై ఓ కొత్త రూల్ అమల్లోకి రానుంది.
Arjun Suravaram
దేశం వ్యాప్తంగా సుదూరంగా రోడ్డు మార్గాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి రహదారులు ఉంటాయి. ఇక హైవేలపై టోల్ గేట్ సిస్టమ్ ఉన్న సంగతి తెలిసింది. ఆయా మార్గాల్లో ఉన్న టోల్ ఫీజు చెల్లిస్తూ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇది ఇలా ఉంటే..ఈ టోల్ గేట్ వద్ద రుసుము చెల్లింపులో ఆలస్యం జరగకుండా చాలా కాలం క్రితం ఫాస్టాగ్ సర్వీస్ ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసింది. దీని ద్వారా టోల్ గేట్ పాయింట్ల వద్ద వాహనాల సమయం వృథాకాకుండ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫాస్టాగ్ సర్వీసుల విషయంలో కొత్త రూల్ వచ్చింది. ఆ కొత్త నిబంధన కూడా రేపటి నుంచి అమలు కానుంది. మరి.. ఆ రూల్ ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ప్రస్తుతం రోజుల్లో అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉంటున్న సంగతి తెలిసింది. అందరూ దీనిని విధిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా టోల్ గేట్ వద్ద… ఆటోమెటిక్ గా వాహనదారుడి అకౌంట్ నుంచి రుసుము చెల్లింపు జరుగుతుంది. దీని ద్వారా వాహనాదరులకు టైమ్ వృథకాకుండా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ..నేషనల్ హైవే అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) జూన్ లో ఫాస్టాంగ్ కి సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఫాస్టాగ్ నంబర్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో లేకుంటే హిట్‌లిస్టులో ఉంటుంది. ఈ క్రమంలోనే ఫాస్టాగ్ సర్వీసులపై ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్నది. ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు అన్ని నిబంధనలను పూర్తి చేసేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. మూడు నుంచి ఐదు ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు పాత ఫాస్టా టాగ్ వాడుతున్న వాహనాలు తమ కేవైసీని తప్పనిసరిగా అప్ డేట్ చేయించాలి. అలానే ఐదేళ్ల కంటే పాత ఫాస్టాగ్ ను రీప్లేస్ చేయాలి.
ఇది కూడా ఎన్ పీసీఐ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కేవైసీ ప్రక్రియ గడవు అక్టోబర్ 31తో ముగియనుంది. ఫాస్టాగ్ ప్రొవైడర్లు తమ డేటాబేస్ ను సైతం తప్పనిసరిగా ధృవీకరించి ఉంచాలి. వాహనం ముందు వైపు స్పష్టమైన ఫోటోలను అప్ లోడ్ చేయాలి. అలానే నూతన ఫాస్టాగ్‌ని జారీ చేయడం, సెక్యూరిటీ డిపాజిట్, కనీస రీఛార్జ్ కి సంబంధించి కూడా ఎన్‌పీసీఐ నిర్ణయించింది. మరి.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.