iDreamPost
android-app
ios-app

Diamond: లక్‌ అంటే ఈ రైతుదే.. కౌలుకు తీసుకున్న పొలంలో రూ.25 లక్షల వజ్రం

  • Published Jun 24, 2024 | 1:25 PM Updated Updated Jun 24, 2024 | 1:25 PM

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. తాజాగా ఓ రైతుకు ఇదే అనుభవం ఎదురయ్యింది. కౌలుకు తీసుకున్న పొలంలో 25 లక్షల రూపాయలు విలువ చేసే వజ్రం లభించింది. ఆ వివరాలు..

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. తాజాగా ఓ రైతుకు ఇదే అనుభవం ఎదురయ్యింది. కౌలుకు తీసుకున్న పొలంలో 25 లక్షల రూపాయలు విలువ చేసే వజ్రం లభించింది. ఆ వివరాలు..

  • Published Jun 24, 2024 | 1:25 PMUpdated Jun 24, 2024 | 1:25 PM
Diamond: లక్‌ అంటే ఈ రైతుదే.. కౌలుకు తీసుకున్న పొలంలో రూ.25 లక్షల వజ్రం

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పడం కష్టం. లక్‌ కలిసి వస్తే.. రాత్రికి రాత్రే కటిక దరిద్రుడు కుబేరుడు కావొచ్చు. అదే అదృష్టం తిరగబడితే.. బిలయనీర్‌ బిచ్చగాడు కావచ్చు. మన దేశంలో అదృష్టం అనే టాపిక్‌ వస్తే.. ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది కేరళ లాటరీలు.. ఆ తర్వాత పొలాల్లో వజ్రాలు దొరకడం. ఈ రెండో సంఘటన ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుంది. వర్షాకాలం ప్రారంభం అయ్యిందంటే చాలు.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో వజ్రాల వేట ముమ్మరంగా సాగుతుంది. ప్రతి రోజు ఎవరో ఒకరికి వజ్రాలు దొరుకుతుంటాయి. ఇక వీటి విలువ కూడా లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో ఓ రైతును అదృష్టం మాములుగా వరించలేదు. కౌలుకు తీసుకున్న పొలంలో 25 లక్షల విలువైన వజ్రం లభించి.. అతడి దశ తిరిగింది. ఇంతకు ఈ లక్కియేస్ట్‌ సంఘటన ఎక్కడ జరిగిందంటే..

వర్షాకాలం ప్రారంభం అయ్యిందంటే చాలు.. ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వజ్రాల వేట సాగిస్తారు. మధ్యప్రదేశ్‌లో రైతులు కూడా వర్షాకాలంలో పొలాల్లో వజ్రాల వేటకు దిగుతారు. ఈ క్రమంలో తాజాగా పన్నాకు చెందిన ఓరైతును అదృష్టం వరించింది. అతడు లీజుకు తీసుకున్న పొలంలో 25 లక్షల రూపాయల ఖరీదు చేసే వజ్రం లభించింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కొన్ని వారాల కిందటే సదరు రైతుకు ఇదే పొలంలో వజ్రం దొరికింది. అలా రెండు సార్లు అదృష్టం అతడిని వరించింది. ఆ అదృష్టవంతుడు ఎవరంటే..

పన్నా జిల్లా గౌరేయ కాకరహటి గ్రామానికి చెందిన దేశ్‌రాజ్‌ అనే రైతు వజ్రాల మైనింగ్‌ కోసం.. పట్టి బజారియా అనే గ్రామంలో ఉన​ ఓ పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. భార్యతో కలిసి కొన్ని నెలలుగా పొలంలో వజ్రాల కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని వారాల కిందట దేశ్‌రాజ్‌కు అతడు లీజుకు తీసుకున్న పొలంలో సుమారు 3 లక్షల రూపాయలు ఖరీదు చేసే 1.65 క్యారెట్‌ వజ్రం దొరికింది. ఆ తర్వాత కూడా వజ్రాల వేట కొనసాగించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతడికి 6.65 క్యారెట్ల వజ్రం లభించింది. దాంతో వారి సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

దేశ్‌రాజ్‌ దంపతులు తమకు దొరికిన రెండు వజ్రాలను.. పన్నా డైమండ్‌ ఆఫీసులో డిపాజిట్‌ చేశారు. త్వరలో జరిగే వజ్రాల వేలం పాటలో దాన్ని ఉంచుతామని తెలిపారు. ఇక వేలంలో రెండో సారి దొరికిన వజ్రం సుమారు 25 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. వారాల వ్యవధిలోనే రైతుకు రెండు వజ్రాలు దొరకడం సంచలనంగా మారింది. అతడి అదృష్టాన్ని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు. ఇక దీని కన్నా ముందు దొరికిన వజ్రాన్ని కూడా వేలంలో ఉంచుతామని.. అప్పుడు రెండింటికి కలిపి ఎంత వస్తుందో.. తెలుస్తుందని అంటున్నారు.